Ads
మాములుగా ప్రతి అమ్మాయికి తన కలల రాకుమారుడి గురించి కొన్ని ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. తన కు కాబోయే భర్త ఇలా ఉండాలి.. ఇలా ఆలోచించాలి అని రకరకాలు గా అనుకుంటుంటారు. అయితే, అమ్మాయిలకి ఎలా ఉండాలో క్లారిటీ ఉండడం తో పాటు.. ఎలా ఉండకూడదో కూడా క్లారిటీ ఉండాలి. ఎలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకోకూడదు ఇప్పుడు తెలుసుకోండి.
Video Advertisement
#1. ఎప్పుడు చూసినా ఎదో ఒక కండిషన్లు, రెస్ట్రిక్షన్లను పెట్టె అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు పెళ్లి చేసుకోకూడదు. పెళ్ళికి ముందే ఇలాంటి కండిషన్లు పెట్టేవారితో పెళ్లి అయ్యాక మరింతగా ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయట. అది ఎంతవరకు దారి తీస్తుందో చెప్పడం ఎవరి తరమూ కాదు. అందుకే..అలా కండిషన్లు పెట్టె అబ్బాయిలను పెళ్లి చేసుకోకపోవడమే మంచిది.
#2. జంతువులను హింసించే అబ్బాయిలు, అలాగే జంతువులంటే అస్సలు ప్రేమ లేని యువకుల్ని కూడా పెళ్లి చేసుకోకూడదట. ఎందుకంటే, వీరిలో చాలామంది జంతువుల్లానే భార్యలని హింసిస్తారట. అందుకే అలాంటి అబ్బాయిలని పెళ్లి చేసుకోవడం అంత మంచిది కాదట.
#3. మీరు ఇష్టపడేసరికే వేరే యువతీ తో రిలేషన్ లో ఉండి.. మీ కోసం ఆమెతో సంబంధాన్ని తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధపడే వ్యక్తులను కూడా పెళ్లి చేసుకోవడం సరికాదట. ఎందుకంటే అలాంటివారికి సంబంధాలపై ఇష్టం లేకపోతె.. భార్యని కూడా వదిలివేయడానికి వెనుకాడరట.
#4. ఒకసారి మాట ఇచ్చి తప్పే యువకుల్నికూడా పెళ్లి చేసుకోరాదట. అలాంటి వారిని నమ్మడం చాలా కష్టం. అలాంటి సంబంధాలు నిలబడవు.
#5. కట్టుకోబోయే అమ్మాయి కంటే వేరేవారికి ప్రాధాన్యతను ఇచ్చేవారిని పెళ్లి చేసుకోకండి. ఎందుకంటే, వారు భార్యని అంతగా ప్రేమించరట.
#6. ఏ విషయం లో అయినా నిలకడ గా నిర్ణయం తీసుకోలేని వారిని పెళ్లాడకూడదట. ఎందుకంటే వీరు నిరంతరం తాము తీసుకున్న నిర్ణయం తప్పనే భావనలో ఉంటారట. ఏ విషయం లో కూడా వీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరట.
#7. అతిగా సారీ చెప్పేవారికి దూరంగా ఉండాలట. ఏదైనా పొరపాటు జరిగితే ఎవరైనా సారీ చెప్తారు. కానీ, అవసరానికి మించి సారీ చెప్పేవారు అతిగా స్పందించే స్వభావం కలిగిన వారు అవుతారు. వీరితో భవిష్యత్ లో ఇబ్బందులు వస్తాయట.
#8. అవతలి వ్యక్తులు చెప్తున్న విషయాలను పట్టించుకోకుండా గొడవలు పడే వ్యక్తులు కూడా పెళ్లి చేసుకోవడం మంచిది కాదట. దీనివలన పెళ్లి అయ్యాక గొడవలు వచ్చి ఇబ్బందులు పడతారట. ఎదుటివారితో మర్యాద లేకుండా ప్రవర్తించే వారితో కూడా సంబంధాలు పెట్టుకోకూడదట. ఎందుకంటే వీరికి భార్య పట్ల కూడా గౌరవం ఉండదు.
#9. ఏ పని చేయకుండా, ఇతరులపై ఆధారపడుతున్న వారిని కూడా పెళ్లి చేసుకోకూడదట. ఎందుకంటే, వీరు పెళ్లి అయినతరువాత కూడా సంపాదించకుండా, భార్య సంపాదనపై ఆధారపడతారట. అలాగే, తల్లితండ్రుల పట్ల సఖ్యం గా మెలగని వారిని కూడా పెళ్లి చేసుకోకూడదట. ఎందుకంటే, వీరు భార్యతో కూడా సఖ్యత గా ఉండరు.
End of Article