తొమ్మిదేళ్ల విరామం తర్వాత మెగా స్టార్ చిరంజీవి సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు నుంచి ఆశించిన మెరుపులు రాలేదు అభిమానులకు. ఈ నేపథ్యం లో ఇటీవల ఆచార్యతో పరాజయం పొందిన చిరంజీవి వరుస పెట్టి సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో గాడ్ ఫాదర్ ఒకటి. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కు రీమెక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కిన విషయం తెలిసిందే.

Video Advertisement

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అదే అంచనాల మధ్య చాలా గ్రాండ్ గా అక్టోబర్ 5న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఆచార్య తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాపై ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలు రీచ్ అయ్యాయని తెలుస్తోంది.

'god father' ott release update..
ఈ గాడ్ ఫాదర్ సినిమాకు తొలి ఆట తోనేసూపర్ హిట్ టాక్ రావడంతో మెగాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆచార్య డిజాస్టర్ జ్ఞాపకాల నుంచి బయటకొచ్చి ఖుషీ ఖుషీ అవుతున్నారు. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికర విషయం హాట్ టాపిక్ గా మారింది.

'god father' ott release update..
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రూ. 57 కోట్లకు తెలుగు, తమిళం, హిందీ భాషల హక్కులను నెట్ ఫ్లిక్స్ చేజిక్కుంచుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా చిరంజీవి తర్వాతి సినిమా హక్కులను సైతం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మూవీ సుమారు 8 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజుల వరకు ఆగాల్సిందే.

'god father' ott release update..
ఇక మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేష్‌తో “భోళా శంకర్” అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు దీనికి సంబంధించిన పోస్టర్‌లో చిరంజీవి అదరగొట్టారు. స్టైలీష్ అండ్ యంగ్‌ లుక్‌లో వావ్ అనిపించారు.

'god father' ott release update..
వీటితో పాటు చిరంజీవి తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటించబోతుందని లేటెస్ట్ టాక్. ఇప్పటికే శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో కీలకపాత్రలో సీనియర్ హీరోయిన్ సుమలత కనిపించనున్నారట.చిరంజీవి డ్యుయల్ రోల్‌లో కనిపించనున్నారట. అందులో భాగంగానే శృతిహాసన్‌తో పాటు సుమలత నటించనున్నారని అంటున్నారు.