Ads
‘మ్యాచో స్టార్ గోపీచంద్’ హీరోగా.. టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ రూపొందించిన సినిమా ‘రామబాణం’. ఈ మూవీకి మొదటి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా రాలేదు. ఓపెనింగ్స్ మొదలుకొని ఫుల్ రన్‌లోనూ ఈ మూవీ ఆశించిన రీతిలో కలెక్షన్లను మాత్రం అందుకోలేదు.
Video Advertisement
హిట్ కాంబినేషన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘రామబాణం’ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. కానీ లక్ష్యం, లౌక్యం హిట్స్ తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కలయికలో రూపొందిన ఈ మూవీ ఇద్దరికీ హ్యాట్రిక్ విజయాన్ని అందివ్వలేకపోయింది. యాక్షన్ ఫ్యామిలీ డ్రామా కథాంశంతో రూపొందిన రామబాణం మే 5న థియేటర్లలో రిలీజైంది.
అయితే హిట్ కాంబినేషన్ కారణం గా దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం సోనీ లివ్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. దాదాపు ఎనిమిది కోట్లకు రామబాణం డిజిటల్ రైట్స్‌ను సోనిలివ్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సదరు సంస్థ జూన్ 3వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతుందని తెలుస్తోంది.
దాదాపు 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట్రికల్ రన్‌లో కేవలం పది కోట్ల వరకు మాత్రమే వసూళ్లను రాబట్టి నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. కథలో కొత్తదనం లేకపోవడం రామబాణం డిజాస్టర్‌కు ప్రధాన కారణంగా నిలిచింది. థియటర్లలో విడుదలై నెల రోజులు కాకుండానే ఓటీటీ లోకి వస్తోంది ఈ చిత్రం. మరి ఇందులో ఈ చిత్రం ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
‘రామబాణం’ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, కుస్భూ సుందర్, తరుణ్ రాజ్, నాజర్, సచిన్ ఖేడ్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు.
Also read: RRR సినిమాలో రాజమౌళి వాడిన ఈ టెక్నిక్ ని గమనించారా..?
End of Article