యాలకులు రోజు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

యాలకులు రోజు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

by kavitha

Ads

సుంగధ ద్రవ్యాలలో యాలకులు ప్రత్యేకమైనవి. వీటి ఖరీదు కూడా ఎక్కువే.  యాలకుల కేజీ ఖరీదు వాటి నాణ్యత ప్రకారంగా వెయ్యి నుండి 6 వేలకు వరకు ఉంటుంది. యాలకులను కొన్ని ప్రాంతాల్లో ఏలకులు అని కూడా పలుకుతారు. మన దేశంలో ప్రాచీనమైన కాలం నుంచి యాలకులను ఉపయోగిస్తున్నారు.

Video Advertisement

యాలకులలో ఎన్నో పోషకాలను ఉన్నాయి. అందువల్లనే యాలకులను పోషకాల భాండాగారం అని పిలుస్తారు. పచ్చి యాలకులను తినడం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. యాలకులను వంటకాలలో వాడితే అవి మంచి వాసనతో గుమగుమలాడుతాయి. ఫైబర్ కంటెంట్ యాలకుల గింజలలో అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి యాలకులు తినడం వల్ల పోషకాల యొక్క లోపం తొలగిపోతుంది. green-caradom-benefits-advantagesయాలకులలో ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రొటీన్, పొటాషియం, కార్బోహైడ్రేట్, కాల్షియం లాంటి ఎన్నో మూలకాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో  సాధారణంగా వచ్చే సమస్యలలో ఊబకాయం కూడా ఒకటి. ప్రతి ఒక్కరూ కూడా కడుపు నిండా తినాలని, అదే సమయంలో అందంగా కనిపించాలని అనుకుంటారు. అయితే రోజువారీ లైఫ్ స్టైల్ ను మార్చుకోవడానికి అంతగా ఇష్టపడరు.
green-caradom-benefits-advantages2ఇక ఆఫీసులలో కూర్చుని వర్క్ చేసేవారికి, ముఖ్యంగా కడుపులో సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనికి కారణం గంటలు గంటలు కూర్చుని వర్క్ చేయడమే. శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటే సమస్యలు తీవ్రమవుతాయి. అందువల్ల రోజు రాత్రిపూట నిదురించే ముందు రెండు యాలకులను వేడి నీటితో తీసుకోవడం వల్ల పొట్టలోని కొవ్వు కరుగుతుంది.green-caradom-benefits-advantages1యాంటీ బాక్టీరియా లక్షణాలు పచ్చి యాలకులలో మెండుగా ఉన్నాయి. అందువల్ల పచ్చి యాలకులను రోజూ తినడం వల్ల బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులను తగ్గిస్తుంది. అంతే కాకుండా యాలకులలో ఉండే పొటాషియం, ఫైబర్ రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అలాగే రోజూ యాలకులు తినడం వల్ల మూత్రనాళ వ్యాధులు  రాకుండా ఉంటాయి. ఆకుపచ్చని  యాలకులు తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్‌ వారికి ప్రయోజనకరంగా ఉంటుందట. పచ్చి యాలకులను ప్రతిరోజూ తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. green-caradom-benefits-advantages3Also Read: ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వంకాయ తినకూడదంట.. అవి ఏమిటంటే..


End of Article

You may also like