Ads
సరుకులు (జీ), సేవల (ఎస్)పై పన్ను (టీ)నే సంక్షిప్తంగా జీఎస్టీ అని అంటున్నాం. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న ఎన్నో పన్ను చట్టాల స్థానంలో ఏకైక పన్ను చట్టమైన జీఎస్టీని అమల్లోకి తీసుకు వచ్చింది ప్రభుత్వం. 2017 జూలై 1 నుంచి దీన్ని అమలు చేస్తున్నారు. ఇంతకు ముందు వరకు పన్ను ఆదాయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వాటా ఉండేది.
Video Advertisement
సాధారణం గా తయారీ అయ్యే చోట ఓ వస్తువుపై కేంద్రం ఎక్సైజ్ సుంకం విధిస్తుంది. దానిపై అమ్మకం సమయంలో రాష్ట్రాల స్థాయిలో వ్యాట్ ను వసూలు చేస్తున్నారు. దీంతో రెండు దశల్లో పన్ను పడుతోంది. ఇక్కడ కేంద్రం విధించిన ఎక్సైజ్ సుంకంపైనా పన్ను చెల్లించాల్సి రావడం జరిగేది. దీంతో ఏ వస్తువుపై ఎంత పన్ను అని అడిగితే చెప్పడానికి క్లారిటీ ఉండేది కాదు. అందుకే ఒకటే దేశం, ఒకటే మార్కెట్, ఒకటే పన్ను… అదే జీఎస్టీ అని కేంద్రం చెబుతోంది.సెంట్రల్ జీఎస్టీ(సీజీఎస్టీ), స్టేట్ జీఎస్టీ(ఎస్ జీఎస్టీ), ఇంటెగ్రేటెడ్ జీఎస్టీ(ఐ జీఎస్టీ) అని మూడు వర్గీకరణలు చేశారు. కేంద్రం స్థాయిలో పన్నులన్నీ సీ జీఎస్టీలో కలిసిపోతాయి. రాష్ట్రాల స్థాయిలో పన్నులన్నీ ఎస్ జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. రెండు రాష్ట్రాలకు చెందిన సంస్థల మధ్య లావాదేవీలు ఐ జీఎస్టీ పరిధిలోకి వస్తాయి.
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే మార్కెట్. ఒక వస్తువుపై దేశవ్యాప్తంగా ఒకటే పన్ను. దీనివల్ల పన్ను చట్టం సులభతరం అవుతుంది. వ్యాపార వ్యయాలు తగ్గుముఖం పడతాయి. పారదర్శకత పెరుగుతుంది. ఎన్నో శాఖలతో అవసరం ఉండదు గనుక అవినీతి తగ్గుముఖం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇప్పుడు ఏ ఏ వస్తువుకి ఎంత జీఎస్టీ పడుతుందో ఇప్పుడు చూద్దాం..
#1 బట్టలు
ఏ విధమైన బట్టలకైనా జీఎస్టీ 12 శాతంగా ఉంది.
#2 కళ్లద్దాలు (కూలింగ్ గ్లాస్సెస్)
కూలింగ్ గ్లాసెస్ పై జీఎస్టీ 12 శాతంగా ఉంది.
#3 హెయిర్ కటింగ్
హెయిర్ కటింగ్, హెయిర్ డ్రెస్సింగ్ పై జీఎస్టీ 18 శాతం ఉంది.
#4 ఇయర్ ఫోన్స్
ఏ విధమైన మ్యూజిక్ కి సంబంధించిన పరికరాలైన 18 శాతం జీఎస్టీ తో ఉన్నాయి.
#5 టూత్ పేస్ట్
నిత్యావసర వస్తువులపై 18 శాతం జీఎస్టీ పడుతుంది.
#6 షేవింగ్ క్రీం
షేవింగ్ క్రీం, షేవింగ్ జెల్స్ పై 18 శాతం జీఎస్టీ ఉంది.
#7 రిస్ట్ వాచ్
రిస్ట్ వాచ్ లపై జీఎస్టీ కి ముందు 12 శాతం గా ఉన్న టాక్స్ ప్రస్తుతం 18 శాతంగా ఉంది.
#8 పెర్ఫ్యూమ్
అన్ని రకాల పెర్ఫ్యూమ్ లపై 18 శాతం జీఎస్టీ ఉంది.
#9 మొబైల్ ఫోన్స్
అన్ని రకాల మొబైల్ ఫోన్స్ పై 18 శాతం జీఎస్టీ పడుతోంది.
#10 బెల్ట్స్
లెదర్ తో తయారు చేసే ఉత్పత్తులపై 12 శాతం జీఎస్టీ పడుతోంది.
#11 లో దుస్తులు
లో దుస్తులపై 12 శాతం జీఎస్టీ పడుతోంది.
#12 బూట్లు
బూట్లపై 5 శాతం వరకు జీఎస్టీ పడుతోంది.
End of Article