గుంటూరు కారం సినిమా ఆ నవల నుండి కాపీ కొట్టి తీస్తున్నారా..? దీనికి ప్రొడ్యూసర్ రెస్పాన్స్ హైలైట్..!

గుంటూరు కారం సినిమా ఆ నవల నుండి కాపీ కొట్టి తీస్తున్నారా..? దీనికి ప్రొడ్యూసర్ రెస్పాన్స్ హైలైట్..!

by Mounika Singaluri

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తర్కెక్కుతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కనుక విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. హారికా అండ్ హాసిని బ్యానర్ పైన ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Video Advertisement

సంక్రాంతికి భారీ ఎత్తున ఈ సినిమాని విడుదల చేసేందుకు ప్రణాలికల రూపొందించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గుంటూరు కారం సినిమా స్టోరీ త్రివిక్రమ్ కాపీ కొట్టాడంటూ పలువురు ఆరోపిస్తున్నారు. యద్దనపూడి సులోచన రాణి రాసిన కీర్తి కిరీటాలు నవల నుండి గుంటూరు కారం స్టోరీ లైన్ తీసుకుని సినిమాని రూపొందిస్తున్నారంటూ ఆరోపించారు. గతంలో త్రివిక్రమ్ రూపొందించిన అ ఆ సినిమా కూడా యుద్ధనపుడి సులోచనరాణి రాసిన మీన నవల నుండి ప్రేరణ పొందింది. అయితే అ ఆ సినిమాకి ఆమెకి క్రెడిట్ ఇవ్వకపోవడంతో ఆమె కాపీరైట్స్ ఇష్యూ తీసుకురావడంతో త్రివిక్రమ్ ఆమెతో సెటిల్మెంట్ చేసుకున్నారని వార్తలు కూడా వచ్చాయి.

అలాగే త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో రూపొందించిన అలవైకుంఠపురం సినిమా కూడా కాపీ అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం గుంటూరు కారం సినిమా మీద కూడా ఇటువంటి రూమర్సే స్ప్రెడ్ అవుతున్నాయి. దీనిపైన నిర్మాత నాగావంశీ స్పందిస్తూ ట్విట్టర్ లో కామెంట్ చేశారు. జనవరి 12న ఎర్లీ మార్నింగ్ షో లో ఏఎంబి థియేటర్ లో కలుద్దాం అంటూ రిప్లై ఇచ్చారు. దీనికి ఫన్నీగా నవ్వుతున్నట్లు ఎమోజీలను కూడా యాడ్ చేశారు. ఈ కాపీ రూమర్ నిజమో కాదో తెలుసుకోవాలంటే జనవరి 12 వరకు వేచి చూడాల్సిందే.


End of Article

You may also like