Ads
కొంతమంది ఎప్పుడు ఎక్కడ కూర్చున్న కూడా అదే పనిగా రెండు కాళ్ళు ఊపుతూ ఉంటారు. చిన్నతనంలో ఇలా చేసినపుడు బామ్మలు లేదా అమ్మమ్మలు కాళ్లు ఊపడం దరిద్రం అంటూ తల పై మొట్టికాయలు వేయడం, లేదా కాళ్ళు ఊపకూడదని కోప్పడేవారు.
Video Advertisement
ఎక్కువగా ఖాళీగా కూర్చున్న సమయంలో కాళ్ళు ఊపడం అనేది కనిపిస్తుంటుంది. కొంతమంది అయితే గ్యాప్ లేకుండా కాళ్లను ఊపుతూనే ఉంటారు. ఇలా కాళ్ళు ఊపుతుంటే వారు చేస్తున్న వర్క్ పై మీద దృష్టి ఉండదని చెబుతుంటారు. అయితే కాళ్ళు ఊపడం మంచిదో? కాదో ఇప్పుడు చూద్దాం..
బీబీసి తెలుగు న్యూస్ కథనం ప్రకారం, కాళ్ళు ఊపడం వెనుక ఒక కారణం ఉందని తెలుస్తోంది. ఇతరుల దృష్టిని ఆకర్షించడం కోసం కొందరు కాళ్ళు ఊపుతూ ఉంటారట. ఈ విధంగా చేయడాన్ని ఫిజెటింగ్ అని పిలుస్తారు. అయితే ఫిజెటింగ్ పై ఉన్న ఈ అభిప్రాయనికి భిన్నమైన అభిప్రాయాన్ని తాజాగా చేసిన కొత్త అధ్యయనంలో తెలిసింది. ఆరోగ్యకరమైన బరువు కోసం, స్ట్రెస్ ను అధిగమించడం కోసం మరియు ఎక్కువ కాలం బ్రతకడం కోసం ఈ ఫిజెటింగ్ దోహదపడుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది.
“ఒకే చోట కదలకుండా ఎక్కువ సేపు కూర్చుని ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే కూర్చుని ఉన్నప్పుడు కాళ్ళను తరచూ ఊపడం లేదా కదిలించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని” అని న్యూట్రిషనిస్ట్‌గా యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌లో వర్క్ చేసే జానెత్ కాడే వెల్లడించింది. గంటల తరబడి కుర్చీలో కూర్చుని ఉండటం వల్ల, బాడీలోని మెటాబాలిజం రేటు తగ్గిపోతుంది. దానివల్ల బ్లడ్ షుగర్‌ను, బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేసే సామర్థ్యం పై ఎఫెక్ట్ పడుతుంది. అలాగే శరీరంలోని ఫ్యాట్ ను కరిగించేందుకు అడ్డంకిగా కూడా మారుతుంది.ఒకే చోట కూర్చుని ఉండటం కన్నా, ఎప్పుడూ కదులుతూ ఉండటం ద్వారా బరువు తగ్గేందుకు ఈ ఫిజెటింగ్ సహాయ పడుతుందని అధ్యయనం తెలుపుతోంది. ఫిజెటింగ్ లా కాళ్లను ఊపడం ద్వారా శరీరంలో ఉన్న అదనపు బరువును తగ్గించుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు.
End of Article