ఈ అలవాట్లే బ్రేకప్ కు దారి తీస్తాయి.. మీక్కూడా ఉన్నాయేమో చెక్ చేసుకుని జాగ్రత్త పడండి..!

ఈ అలవాట్లే బ్రేకప్ కు దారి తీస్తాయి.. మీక్కూడా ఉన్నాయేమో చెక్ చేసుకుని జాగ్రత్త పడండి..!

by Anudeep

Ads

సోషల్ మీడియా యుగంలో ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరుచుకోవడానికి క్షణం కూడా ఆలస్యం చేయడం లేదు. అయితే.. ప్రేమ ఎంత త్వరగా పుడుతుందో.. అంతే త్వరగా గొడవలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రేమికుల మధ్య ఉన్న అతి చనువు కూడా ఒక్కోసారి బ్రేకప్ కు దారితీస్తోంది. చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రైవసీ అన్న పదమే చెరిగిపోయింది.

Video Advertisement

దానికి తోడు ఫోన్ ను ఎక్కువ వాడుకుంటూ పర్సనల్ స్పేస్ ను పెంచుకోవడం కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం బీటలు వారడానికి కారణం అవుతోంది. కొన్ని అలవాట్ల వలన కూడా ఎంతో అన్యోన్యంగా ఉండే జంట విడిపోవచ్చు.

breakup 1

ఇద్దరు ప్రేమికుల మధ్య బ్రేకప్ కు దారి తీసే అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ బంధంలో అయినా ఒకరిని ప్రేమించినప్పుడు వారి తప్పులను స్వీకరించే మనస్తత్వం ఉండాలి. అది ఈరోజుల్లో లేకపోవడం వలన చాలా మంది మధ్య వచ్చే మనస్పర్థలు ఎప్పటికీ తొలగక బ్రేకప్ కు దారితీస్తున్నాయి. రిలేషన్ షిప్ లో ఇద్దరి అభిప్రాయాలకు విలువ ఉండాలి. అంతే తప్ప మీ భాగస్వామి మీ చెప్పుచేతల్లోనే ఉండాలని కోరుకుంటే  మాత్రం ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు.

breakup 5

కొందరు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలి లాంటివి కూడా నిర్ణయించేస్తూ ఉంటారు. దానివల్ల మీ భాగస్వామికి మీపై ఉన్న ఇష్టం కాస్త అసహ్యంగా మారుతుంది. పూర్తిగా మీ భాగస్వామిపై ఆధారపడడం. రిలేషన్ షిప్ అన్నాక ఒకరి పనులు ఒకరి పంచుకోవడం సహజమే.. కానీ.. పూర్తిగా భాగస్వామిపైనే ఆధార పడడం వలన కూడా మీరు చులకన అయ్యే అవకాశం ఉంటుంది.


End of Article

You may also like