Ads
రాజకీయనాయకులకు ప్రజల్లో ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. వారు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు బేసిక్ గా మంచి వక్తలు అయ్యుంటారు. అలాగే మంచి రచయితలు కూడా. వాళ్ళు తమ భావాలను నిర్ద్వంద్వం గా వ్యక్తపరుస్తారు.
Video Advertisement
ఇప్పుడు కొందరు నాయకులు తమ స్వదస్తూరితో రాసిన కొన్ని లేఖలను ఇప్పుడు చూద్దాం..
#1 నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మంచి వక్త అన్న విషయం మనకి తెల్సిందే. ఆయన మంచి రచయిత కూడా. అయితే ఆయన చేతిరాత ఇంత అందం గా ఉంటుందని మనం ఊహించి ఉండము. ఆయన చేతిరాతను ఇక్కడ చూడండి.
#2 ఎన్టీఆర్
ఎన్టీఆర్ కు తెలుగు భాష పై మంచి పట్టు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన చదువులోనూ ముందుండేవారు. ముత్యాలు లాంటి అక్షరాలు, ఎక్కడ తప్పులు లేని వాక్యాలు, ఓ రచయిత రాసినట్టుగా రాసిన వ్యాఖ్యానాలు ఆయన సొంతం.
#3 పవన్ కళ్యాణ్
తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ చేతి రాత కూడా చాలా పొందికగా ఉంటుంది.
#4 మన్మోహన్ సింగ్
మన్మోహన్ సింగ్ జర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా, ప్రధాని ఆర్ధిక సలహాదారుగా, ఆర్ధిక మంత్రిగా, ప్రధాన మంత్రిగా భారతదేశానికి సేవలందించారు.ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి నేడు భారత్ అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ఆనాడే బీజాలు వేశారు.
#5 జయలలిత
ఉక్కు మహిళగా పేరొందిన తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన అభిప్రాయాలను నిర్మొహమాటం గా వ్యక్తపరిచేవారు. ఈ విషయాలు ఆమె రాసిన లేఖల్లో స్పష్టంగా ఉన్నాయి.
#6 కరుణానిధి
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేసారు. ఈ క్రమం లో ఆయన రాసిన ఒక తనిఖీ నివేదిక లో ఆయన చేతిరాతని మనం చూడొచ్చు.
#7 జయప్రకాశ్ నారాయణ్
జయప్రకాష్ నారాయణ్ ని సాధారణం గా జెపి లేదా లోక్ నాయక్ అని పిలుస్తారు. ఈయన ఒక సోషలిస్ట్ అలాగే రాజకీయ నాయకుడు. ఆయన జైలు లో ఉన్న సమయం లో రాసిన డైరీ లో ఆయన చేతి రాత మనం చూడొచ్చు.
#8 పివి నరసింహ రావు
నూతన సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన నేత, అపర చాణక్యుడు, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహా రావు. ఆయన చేతి రాత ఇక్కడ మనం చూడొచ్చు.
#9 అటల్ బిహారి వాజపేయి
మాజీ ప్రధాని, బీజేపీ తొలి అధ్యక్షుడు, ఆధునిక రాజకీయాల్లో మేరునగధీరుడు, ‘భారతరత్న’ అటల్ బిహారీ వాజ్‌పేయి. ఐక్యరాజ్య సమితిలో తొలిసారిగా హిందీలో ప్రసంగించి వాజ్‌పేయి చరిత్ర సృష్టించారు. ఆయన చేతిరాత చూడండి.
End of Article