అమ్మాయిలూ.. పీరియడ్స్ టైం లో నొప్పి వస్తోందా..? అయితే మంచిదే..! ఎందుకో తెలుసుకోండి..?

అమ్మాయిలూ.. పీరియడ్స్ టైం లో నొప్పి వస్తోందా..? అయితే మంచిదే..! ఎందుకో తెలుసుకోండి..?

by Anudeep

Ads

అమ్మాయిలకు పీరియడ్స్ గురించి ఇప్పటికే ఓ అవగాహన ఉండి ఉంటుంది. ఆ సమయంలో అమ్మాయిలకు రక్తస్రావం అయ్యి ఇబ్బందిగా ఉంటుంది. కనీసం యాభై నుంచి రెండొందల మిల్లీలీటర్ల వరకు రక్తస్రావం అవుతూ ఉంటుంది. పీరియడ్స్ సమయంలో గర్భాశయ గోడలకు ఆనుకుని ఉండే ఎండోమెట్రియం పొర మందం గా పెరిగి గర్భధారణ కు అనుకూలం గా ఉంటుంది.

Video Advertisement

periods pain

నెల మధ్యలో విడుదల అయ్యే అండం ఫలదీకరణం చెందితే గర్భం దాలుస్తారు. అలా జరగని పక్షంలో.. ఈ అండంతో పాటు ఎండోమెట్రియం పొర కూడా వ్యర్ధ పదార్ధంగా బయటకు వచ్చేస్తుంది. ఈ వ్యర్ధాలన్నీ రక్తంలో కలిసి బయటకు వచ్చేస్తాయి. ఆ సమయాన్నే మనం రుతుస్రావం అంటుంటాం. ఆ రుతుస్రావం సమయంలో చాలా మంది అమ్మాయిలకు పొత్తి కడుపు వద్ద నొప్పి వస్తూ ఉంటుంది. అయితే.. ఇలా రావడం మంచిదే అని వైద్యులు అంటున్నారు.

periods pain 3

దాదాపు 70 నుంచి 80 శాతం మంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో పెయిన్స్ వస్తుంటాయట. అయితే.. కొందరు మహిళలలో ఈ నొప్పి తాలూకు లక్షణాలు వేరుగా ఉండే అవకాశం ఉంది. చాలా మంది పీరియడ్స్ టైంలో నొప్పి వస్తే మంచిది కాదు అనే అభిప్రాయంలో ఉంటారు. కానీ తేలికపాటి లేదా కొంచం మితంగా వచ్చే నొప్పులు మేలు చేస్తాయని చెబుతున్నారు.

periods pain 1

ఇలా నొప్పి వస్తే.. గర్భాశయం, అండాశయం ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పడానికి సంకేతమని అన్నారు. కాబట్టి పీరియడ్స్ టైంలో నొప్పి వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ నొప్పి మంచిదేనని సంతోషించాలంటున్నారు. పీరియడ్స్ సమయంలో పుల్లటి ఆహారపదార్ధాలు తీసుకోకూడదని చెప్తుంటారని.. కానీ దీనికి శాస్త్రీయమైన కారణమేమి లేదని వైద్యులు అంటున్నారు. మితంగా నొప్పి కలగడం వల్ల పెద్ద సమస్య ఏమి ఉండదని చెబుతున్నారు. కానీ, నొప్పి విపరీతం అవుతున్నా.. ఇంకేమైనా ఇతర లక్షణాలు కనిపిస్తున్నా వైద్యుడిని సంప్రదించడమే ఉత్తమం.


End of Article

You may also like