టీ లో బిస్కట్లు ముంచి తింటున్నారా? అసలు ఈ అలవాటు మనదేశం లోకి ఎలా వచ్చిందో తెలుసా?

టీ లో బిస్కట్లు ముంచి తింటున్నారా? అసలు ఈ అలవాటు మనదేశం లోకి ఎలా వచ్చిందో తెలుసా?

by Anudeep

టీ లో బిస్కట్లను ముంచుకుని తినడం ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి..? సాయంకాలం సమయాల్లో.. అప్పుడే ఎండ వేడి తగ్గి.. కాస్త చల్లబడుతున్న టైం లో ఓ కప్ వేడి వేడి టీ తెచ్చుకుని.. అందులో టేస్టీ బిస్కట్ తింటూ ఉంటె ఆ మజా నే వేరు.”టీ” చాలా మందికి ఇష్టమైన పానీయం. సమయం సందర్భం గా లేకుండా, ఎప్పుడైనా..ఎక్కడైనా హాయిగా తాగేసి రిలాక్స్ అయిపోతూ ఉంటాం. కానీ, వాస్తవానికి “టీ” భారతీయుల అలవాట్లలో లేదు. బ్రిటిష్ వారు భారత్ ను పాలించడం ప్రారంభించాక.. ఈ అలవాటు ను ఇక్కడ కూడా ప్రారంభించారు.

Video Advertisement

tea and biscuits 1
టీ అలవాటు కూడా లేని భారత్ ప్రజలకు టీ లో బిస్కట్స్ ముంచుకుని తినే అలవాటు ఎక్కడ నుంచి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. అసలు భారత్ లో బిస్కట్ల తయారీ ఎప్పుడు మొదలైందో తెలుసా..? 16 వ శతాబ్దం లో మొదలైంది. ఈ శతాబ్దం లో తయారు చేయబడిన బిస్కట్లు చాలా గట్టిగా ఉండేవి. దీనితో బ్రిటిష్ వారు వీటిని వేడి వేడి టీ లో ముంచుకుని తినేసేవారు.

tea and biscuits
వారిని చూసే మనకి కూడా ఈ అలవాటు వచ్చింది. కానీ,మనకి అప్పటికి టీ అలవాటు లేదు. వారు భారత్ లో కూడా తేయాకు తోటలను పెంచడం ప్రారంభించారు. అలా.. ఇక్కడ కూడా టీ పొడి లభ్యం అవుతుండడం తో టీ తాగే అలవాటు మొదలైంది. వారిలాగానే భారతీయులు కూడా వేడి టీ లో బిస్కట్లు ముంచి తినడం ప్రారంభించారు. ఆ తరువాత కాలం లో బిస్కట్లను మెత్తగానే తయారు చేస్తున్నారు. కానీ, టీ లో ముంచుకుని తినే అలవాటు మాత్రం పోలేదు. టేస్ట్ బాగుండడం తో..ఈ అలవాటు కొనసాగుతూనే వస్తోంది.


You may also like