ఖాళీ కడుపుతో ఈ వాటర్ ని తాగడం వల్ల కలిగే ఈ 11 లాభాలేంటో తెలుసా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

ఖాళీ కడుపుతో ఈ వాటర్ ని తాగడం వల్ల కలిగే ఈ 11 లాభాలేంటో తెలుసా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

by Anudeep

Ads

బార్లీ గింజలు తెలియని వారెవ్వరూ ఉండరు. అయితే ఎక్కువగా ఈ గింజలను బీర్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. బహుశా అందుకే చాలా మంది వీటిని దూరం పెట్టేస్తూ ఉంటారేమో. కానీ ఈ గింజల వల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. అవేంటో ఈ ఆర్టికల్ లో చూసేయండి.

Video Advertisement

బీర్ తయారీలో ఉపయోగిస్తారు కదా.. ఈ బార్లీ వాటర్ ని తాగితే మత్తు వస్తుందనుకుంటే పొరపాటే. దీనివల్ల అనేక ఫలితాలు ఉంటాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు చిటికలో పరిష్కారం లభిస్తుంది.

barley water 1

ఒక పాత్రను తీసుకుని అందులో నిండా నీరు పోసి ఓ గుప్పెడు బార్లీ గింజలను వేసి మరిగించాలి. ఈ గింజలు పూర్తిగా ఉడికి నీరు కొంచం రంగు మారుతుంది. అప్పుడు చల్లార్చుకుని, లేదా గొరు వెచ్చగా ఆ నీటిని తాగడం వలన అనేక ఆరోగ్య ఫలితాలు లభిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

#1. ఉదయాన్నే పరగడుపున బార్లీ నీటిని తాగితే శరీరంలోని వ్యర్ధ పదార్ధాలన్నీ మూత్ర విసర్జనలో బయటకి వెళ్లిపోతాయి. ఇది కోలన్ కాన్సర్ రాకుండా అరికడుతుంది.

barley water 2

#2. అలాగే వేడి చేసిన వారు బార్లీ నీటిని తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

#3. ఇందులో సహజ యాంటీ ఇంఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. తద్వారా ఈ నీటిని తాగడం వలన కీళ్లు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.

#4. గ్యాస్, అజీర్ణం, కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలకు బార్లీ వాటర్ చిటికెలో పరిష్కారం చూపిస్తుంది.

#5. ఇందులో ఉండే పీచు పదార్ధం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.

barley water 3

#6. మధుమేహం ఉన్న వారికి బార్లీ నీరు ఓ వరం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కర స్థాయిని తగ్గిస్తుంది.

#7. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అలాగే బీపీ ని కూడా అదుపులో ఉంచుతుంది.

#8. ఇక గర్భంతో ఉన్న వారు కూడా ఈ బార్లీ వాటర్ ని తాగితే మూత్రాశయ సంబంధిత ఇబ్బందులు తొలగుతాయి.

barley water 4

#9. కిడ్నీలో రాళ్లు ఉన్న వారు కూడా క్రమం తప్పకుండా ఈ నీటిని తాగితే ఆ రాళ్లు తొలగిపోతాయి.

#10. బాలింతలు ఎక్కువగా ఈ బార్లీ నీటిని తాగితే వారికి పాలు బాగా పడతాయి. జీర్ణశక్తి కూడా బాగా పెరుగుతుంది.

#11. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి బార్లీ వాటర్ మంచి ఛాయిస్. ఇందులో ఉండే పోషకాలు శరీర మెటబాలిజంని కూడా క్రమబద్ధీకరిస్తాయి. అయితే.. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం, సాయంత్రం రెండు సార్లు బార్లీ వాటర్ ని తాగాల్సి ఉంటుంది.


End of Article

You may also like