Ads
సీజన్ ప్రకారం వచ్చే ఫలాలను ఆయా సీజన్ లో తినడం వల్ల పోషకాలు అధికంగా లభిస్తాయి. ఇక ఈ సీజన్ లో ఎక్కువగా లభించే సపోట పండ్లు విరివిగా దొరుకుతాయి. సపోటా పండు ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ పండు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Video Advertisement
ఈ ఫలంలో ఉండే ఫైబర్, కాల్షియం, ఐరన్, పొటాషియం, కాపర్, విటమిన్ బీ, విటమిన్ ఎ, విటమిన్ సి లాంటి పోషకాలు ఉంటాయి. ఈ పండును రోజుకు రెండు తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది. పొట్టలో ఉన్న వ్యర్థాలను తొలగించడంలో ఉపయోగపడుతాయి. అంతే కాకుండా కడుపు, ప్రేగులు శుభ్ర పడుతాయి.
ఈ పండ్లు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. వృద్ధాప్య ఛాయలు కూడా దగ్గరకు రాకుండా చేస్తాయి. ఈ పండ్లు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల వచ్చే వ్యాధుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇక నీరసంగా ఉన్న సమయంలో ఈ పండు తినడం వల్ల వెంటనే శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ పండ్లను తీసుకుంటే మంచి ఫలితము ఉంటుంది.
ఈ పండ్లను గర్భిణీ స్త్రీలు, బాలింతలు తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కిడ్నీల సమస్యలతో ఇబ్బంది పడేవారు సపోటా పండ్లను తినడం వల్ల మేలు కలుగుతుంది. మూత్ర పిండాల్లోని స్టోన్స్ కూడా కరుగుతాయంట. ఈ పండ్లు బరువు తగ్గడంలోనూ, ఎముకలను ధృడంగా ఉంచడంలో, జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతాయి. ఈ పండ్లు రక్తపోటును కంట్రోల్ గా ఉంచడంలో ఉపయోగపడుతాయి. అంతే కాకుండా శరీర బలహీనతను, నరాల ఒత్తిడిని తగ్గించడంలో ఈ పండ్లు ఎంతో ఉపయోగపడుతాయి.
Also Read: వేసవి కాలంలో ఈ ఆహారం తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా చలవ కూడా చేస్తుంది..
End of Article