మీ ఆరోగ్యం ఎలా ఉందో మీ మూత్రమే చెప్పేస్తుంది.. ఈ చిన్న గుర్తులతో మీ సమస్య ఏంటో చెప్పేయచ్చు.. అవేంటంటే?

మీ ఆరోగ్యం ఎలా ఉందో మీ మూత్రమే చెప్పేస్తుంది.. ఈ చిన్న గుర్తులతో మీ సమస్య ఏంటో చెప్పేయచ్చు.. అవేంటంటే?

by Anudeep

ఈ సృష్టి చాలా విచిత్రమైనది. అందులోను మానవ సృష్టి మరింత ఆశ్చర్యాలను కలిగిస్తూ ఉంటుంది. మానవ శరీరం తన సమస్యను తానె గుర్తించి పరిష్కరించుకోగలదు. అయితే.. మనం చేయాల్సిందల్లా మితమైన ఆహరం తీసుకుంటూ.. సమయపాలన పాటించడమే. కానీ, మనం అదే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మన శరీరం లోపల ఏమైనా అనారోగ్యం గా ఉన్నా కూడా.. ఆ సంకేతాలను కూడా శరీరం అందిస్తూ ఉంటుంది.

Video Advertisement

urine 2

వాటిల్లో మొట్ట మొదటిది మన మూత్రమే. మన మూత్రం ఉన్న రంగుని బట్టి మనకు ఏ అనారోగ్య సమస్య ఉందో యిట్టె చెప్పేయచ్చు. వైద్య విధానాలలో కూడా ప్రాధమికం గా మూత్రాన్ని పరీక్షించే అనారోగ్య సమస్యలను గుర్తిస్తారు. పూర్వకాలపు పడ్దతులలో కూడా అనారోగ్యాన్ని గుర్తించడానికి వ్యక్తి మూత్రాన్ని పరిశీలించే వారు. ఇంతకీ మూత్రాన్ని చూసి ఇబ్బంది ని ఎలా గుర్తించాలి అన్న సంగతి చూద్దాం.

urine 1

మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. ఈ రంగు రావడానికి కారణం శరీరం లోని వ్యర్ధాలలో ఉండే రసాయనాలు. రక్తం లో ఉన్న మలిన పదార్ధాలను వడపోస్తే.. అవి మూత్రం గా బయటకు వెళ్లిపోతాయి. రక్తం లో ఉండే ఎర్రరక్తకణాలు వాటి కాలం పూర్తవ్వగానే చనిపోతాయి. అప్పుడు వీటిలో ఉండే హిమోగ్లోబిన్ బిలిరుబిన్ గా మారుతుంది.

urine 3

ఆ తరువాత ఇది యురోక్రోమ్ గా విచ్ఛిన్నం అయిపోయి మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఈ పదార్ధాలు ఎరుపు రంగుని కోల్పోయి పసుపు రంగులోకి మారతాయి. అందుకే యూరిన్ పసుపు రంగులో ఉంటుంది. మనం మంచి నీరు ఎక్కువ గా తాగడం వలన ఈ పదార్ధం డైల్యూట్ అయ్యి మూత్రం లేత పసుపు రంగులో వస్తుంది. మూత్రం ఇలా వస్తోందంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనట్లే.

urine 4

అయితే.. బాగా చమట పెట్టేవారికి మూత్రం కొంత ముదురు పసుపు రంగులో ఉంటుంది. ఎందుకంటే కేవలం వ్యర్ధాలు మాత్రమే మూత్రం ద్వారా బయటకు వస్తుంది. నీరు చమట ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. బాగా ముదురు రంగులో ఉండే మూత్రాన్ని పరీక్షించడం ద్వారా హెర్మోజేనిస్ వంటి వ్యాధులను గుర్తించచ్చు. అలాగే.. మూత్రాన్ని మైక్రోస్కోప్ సాయం తో పరీక్షించి కాన్సర్ వంటి జబ్బులను గుర్తించవచ్చు.


You may also like