Ads
మనలో చాలా మంది టైట్ గా ఉండే దుస్తులు వేసుకోవడానికి ఇష్టపడతారు. ఇలా వేసుకోవడం లో శరీరాకృతి చక్కగా కనిపిస్తుందని.. అందం గా కనిపిస్తామని భ్రమ పడి ఇటువంటి దుస్తులను వేసుకోవడానికి మొగ్గు చూపుతారు. కానీ, టైట్ గా ఉండే బట్టలు స్లో గా మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని మీకు తెలుసా..?
Video Advertisement
శరీరానికి అంటుకుని ఉండే బట్టలు మన ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి. శరీరానికి అంటిపెట్టుకుని.. టైట్ గా ఉండే బట్టల వల్ల మనం ఎక్కడబడితే అక్కడ కూర్చోలేము. ఏ పని పడితే ఆ పని చేసుకోలేము. దుస్తులు అనువుగా లేకపోతె మనం ఏ పనిని చేసుకోలేము. పనుల సంగతి పక్కన పెట్టినా.. నడవడానికి, కింద కూర్చోడానికి కూడా మనకు ఇబ్బంది గానే ఉంటాయి.
ఇలా వేసుకోవడం వలన, కాళ్ళ మధ్య లో రాపిడి కలిగి ఇబ్బంది గా ఉంటుంది. అంతే కాదు ఇంత టైట్ గా వేసుకుంటే తొడ భాగం లో నొప్పులు రావడం, కండరాలపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కండరాలు పట్టేసినట్లు గా ఉండి ఇబ్బంది పడతారు. ఈ ప్రభావం వెన్నుపూస పై కూడా పడి వెన్ను నొప్పి వస్తుంది. బాడీ పెయిన్స్ మరింత ఎక్కువ గా వచ్చే అవకాశం ఉంటుంది.
ఇంత టైట్ గా ఉండే బట్టలు వేసుకుంటే సంతానానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయట. ఆడవారిలోనే కాదు, మగవారిలో కూడా టైట్ గా ఉండే జీన్స్ వేసుకోవడం వలన ఈ ఇబ్బందులు ఎదురవుతాయి. క్రోమోజోముల సంఖ్య చాలా తగ్గిపోతుంది. అలాగే లో దుస్తులు కూడా మరీ బిగుతు గా ఉండేవి వాడకూడదు. దీనివల్ల అవయవాలపై వాటి ప్రభావం పడి కాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
అంతే కాదు, టైట్ గా ఉండే ఇన్నర్ వెర్ వేసుకోవడం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యం గా మహిళల్లో యోని ప్రాంతం వద్ద దురద, మంటలు ఎక్కువ గా వచ్చే అవకాశం ఉంటుంది. మరీ లూజ్ గా ఉండేవి వేసుకుంటే సాగిపోతున్నట్లు ఉంటాయి. కాబట్టి దుస్తులనేప్పుడు మరీ లూజ్ గా కాకుండా, మరీ టైట్ గా కాకుండా కంఫర్ట్ గా ఉండేలా చూసుకోవాలి.
End of Article