ప్యాంట్ వెనుక జేబులో పర్స్ పెట్టుకుంటున్నారా..? ఇలా చేయడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా..?

ప్యాంట్ వెనుక జేబులో పర్స్ పెట్టుకుంటున్నారా..? ఇలా చేయడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా..?

by kavitha

Ads

అందరూ సాధారణంగా పాటించే కొన్ని రకాల అలవాట్లు వారి శరీరానికి ఇబ్బందిని కలగచేస్తాయి. అయితే వెంటనే వాటి ప్రభావం కనిపించకపోయినా, భవిష్యత్ లో ప్రమాదకరంగా మరవచ్చు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Video Advertisement

అలాంటి అలవాట్లలో పర్సు ప్యాంటు వెనుక జేబులో పెట్టుకోవడం ఒకటి. అదేంటి పర్సు వెనక ప్యాంట్ జేబు పెట్టుకుంటే ప్రమాదమా అంటే, ఆరోగ్య నిపుణలు అవుననే అంటున్నారు. మరి పర్సు ప్యాంటు వెనుక జేబులో పెట్టుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
అందరికి డబ్బులను పర్సులో పెట్టుకోవడం అనే అలవాటు ఉంటుంది. అయితే ఆ పర్సును ప్యాంట్ వెనక జేబులో పెట్టుకోవడం ఆరోగ్యానికి ప్రమాదం అనే విషయం చాలామందికి తెలియదు. పర్సుకానీ, వాలెట్‌ని కానీ  మగవారు మరియు కొందరు స్త్రీలు బాక్‌ పాకెట్‌లో పెట్టుకుంటారు. అలా పెట్టకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. అలా  చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయని, ఓ వయసు వచ్చేసరికి, వారు సరిగా నడవలేక, వంగిపోతారని దానికి కారణం  పర్సును వెనక ప్యాంట్ జేబులో పెట్టుకోవడం వల్లే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అది మాత్రమే కాకుండా ఎక్కువసేపు వెనక ప్యాంటు జేబులో పర్సు పెట్టుకోవడంతో “ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్” అనే సమస్య కూడా వస్తుందని చెబుతున్నారు. పర్సు అలా పెట్టుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. తరుచుగా మెడ, వెన్ను, భుజాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుంటారు. దీనికి కారణం పర్సుని వెనుక జేబులో పెట్టడమేనని అంటున్నారు.
వెనుక జేబులో పర్సు పెట్టుకుని ఎక్కువ సేపు కూర్చొనేవారికి నడుముకు సంబంధించిన సమస్యలు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పర్సులను జేబులో పెట్టుకొని గంటలపాటు కూర్చొనేవారికి, డ్రైవింగ్ చేసేవారికి తీవ్ర నడుము నొప్పి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వాలెట్‌ జేబులో పెట్టుకుని కూర్చోవడం వల్ల వెన్నుముక చివరి భాగం పై ప్రెజర్ పడుతుంది. బరువైన, ఎత్తుగా ఉండే వాలెట్‌ పై కూర్చోవడం వల్ల కండరాల సామర్థ్యం తగ్గుతుంది. దీంతో కండరాలలో విపరీతమైన నొప్పి కలుగుతుందని సూచిస్తున్నారు.
వాలెట్ లో డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు, వోచ్చర్స్‌, ఆధార్‌ కార్డుల వంటి పలు కార్డులు పెట్టుకోవడం వల్ల అది బరువుగా మారిపోతుంది. దాన్ని బ్యాక్‌ జేబులో పెట్టుకోవడం వల్ల తుంటి కండరాలు మరియు కీళ్లు ఒత్తడి పడి, ఒంగిపోతాయి.  వీటి బారిన పడకుండా ఉండాలంటే ఆఫీస్‌లో పని చేస్తున్నప్పుడు వాలెట్ ను బ్యాగ్ లో లేదా, డెస్క్ లో పెట్టుకోవాలి. వాహనాలు డ్రైవ్ చేస్తున్నప్పుడు బైక్ కవర్‌లో కానీ, కారు డెస్క్‌లో కానీ పెట్టాలి. పర్సులో అనవసరమైన వాటిని తొలగించాలి. సాఫ్ట్ గా ఉండే పర్సు వాడాలి. పర్సులో కాయిన్స్, కార్డులు లేకుండా నగదు ఉండేలా జాగ్రత్తగా పడాలి.

Also Read: ఒక్కరోజే 6 సార్లు గుండె ఆగిపోయింది… అయినా బతికాడు..! ఎలా అంటే..?


End of Article

You may also like