Ads
ఆర్యోగ్యకరమైన జీవితంలో మనకు జీర్ణ ప్రక్రియ కూడా ఒక భాగమే. కొందరిలో జీర్ణ ప్రకియ మందగించి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారిని చూసుంటాం. మనం తిన్న ఆహరం సరిగ్గా అరగలేని పరిస్థితుల్లో కడుపులో చాలా అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, మలబద్దకం మొదలగు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాం. మన జీర్ణ వ్యవస్థ మెరుగవ్వాలి అనుకునే వారికి మీరు తీసుకునే ఆహారంతో పాటు ఇవి కూడా ఉండేలా చూసుకోండి.
Video Advertisement
యాపిల్: ఖనిజాలు, ఫైబర్, విటమిన్లు మొదలగు ఎన్నో పుష్కలంగా లభించే యాపిల్ అందరికి ఇష్టమే. ఇది మనకు ఆరోగ్యంతో పాటుగా జీర్ణప్రకీయాను మెరుగుపరచడం లో ఎంతగానో ఉపయోగపడుతుంది. యాపిల్ ని జూస్ రూపం లో కూడా తీసుకోవచ్చు, మనం తినే చిరుతిళ్ల రూపం లో కూడా తీసుకోవచ్చు. రోజు ఒక యాపిల్ ఒకటి తినడం వలన జీర్ణప్రక్రియ మెరుగుపరుచుకోవడం తోపాటుగా మన శరీరంలోని మంచి బాక్టీరియా అభివృద్ధి చెయ్యడం లో సహాయపడుతుంది.
పెరుగు: ఇది అందరికి అందుబాటులో ఉండే పదార్థం. కాబట్టి దేన్నీ సులువుగా కూడా చేసుకోవచ్చు దాదాపుగా అందరి ఇలలో ఉంటుంది కూడా. ఇందులో ఆహరం అతి త్వరగా జీర్ణం కావడానికి ఉపయోగపడే బాక్టీరియా ఇందులో ఉంటుందట. మనం తినే ఆహరం తో పాటుగా ఒక కప్పు పెరుగుతో తింటే ఆహరం సులువుగా జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంది. అంతే కాదు విరేచనాలతో బాధపడుతున్న వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
జీలకర్ర: ఇది ప్రతి ఇంటిలో కనిపిస్తుంది. మనం తినే వంటల్లో సుమారు చాల వరకు కూరలు, మొదలగు వాటిలో వాడుతూనే ఉంటారు. యాంటీమైక్రోబయల్, యాంటీ డయాబెటిక్‌తో పాటు యాంటీ కాన్సర్ వంటివి ఇందులో ఉండటం వలన మనకు ఎంతగానో మేలు చేస్తాయి. మనం తినే ఆహారం లో జీలకర్ర తో పాటుగా తీసుకోవడం వలన వంట రుచి మారిపోవడమే కాకకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
ఇవి కూడా చదవండి: ఈ 10 ఫుడ్ ఐటమ్స్ నాన్ వెజ్ కేటగిరీనా? ఇప్పటి వరకు వెజ్ ఫుడ్ అనుకున్నాం కదా..!?
బొప్పాయి: జీర్ణప్రక్రియ మెరుగుపడే ప్రక్రియలో బొప్పాయి కూడా ఎంతగవు ఉపయోగపడుతుంది. అజీర్ణం, అజీర్తి మలబద్ధకం వంటి సమస్యలకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. మీరు తినే ఆహరం తో పాటుగా బొప్పాయి కూడా ఉండేలా చూసుకోండి. అంతే కాదు ఇందులో విటమిన్ ఏ, బీ, సి పుషకాలంగా అందిస్తుంది బొప్పాయి. క్రమం తప్పకుండ బొప్పాయి తినే వారిలో మన శరీరం లో హానికరమైన టాక్సిన్లు బయటకు పంపేస్తుందట బొప్పాయి.
End of Article