అమ్మాయిలూ.. ఈ విషయాల పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారా..? ప్రతి అమ్మాయీ తప్పక చదవాలి..!

అమ్మాయిలూ.. ఈ విషయాల పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారా..? ప్రతి అమ్మాయీ తప్పక చదవాలి..!

by Anudeep

అమ్మాయిలు అందం గా కనిపించడానికి ఎంతగానో తాపత్రయ పడుతుంటారు. అయితే.. అందం గా కనిపించడం తో పాటు వ్యక్తిగతం గా శుభ్రం గా ఉండడం కూడా ఎంతో అవసరం. శరీరం బయట మాత్రమే కాదు లోపల కూడా పరిశుభ్రం గా ఉంచుకోవాలి. మామూలుగానే అమ్మాయిలకి ఇంట్లో అదనపు బాధ్యతలు ఉంటాయి. కాలేజీ, ఆఫీస్ లకు వెళ్లే అమ్మాయిలకు తీరిక తక్కువ గానే ఉంటుంది. అయినప్పటికీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించి అమ్మాయిలు ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Video Advertisement

1 skin care

మీ చర్మం అందం గా కనిపించాలంటే మాయిశ్చరైజర్లు, సన్ స్క్రీన్ లోషన్లు రాసినంత మాత్రాన సరిపోదు. రోజుకు రెండు సార్లు శుభ్రం గా స్నానం చేయాలి. దానివలన చర్మం పై పేరుకున్న మృతకణాలు తొలగి చర్మం ఆరోగ్యం గా ఉంటుంది. అలాగే ఏది పడితే ఆ సబ్బు కాకుండా, పిహెచ్ తక్కువ గా ఉండే సోప్ లను వినియోగించడం మంచిది.

2 vaginal care

వెగైనా ను శుభ్రపరిచే క్రమం లో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది అధికం గా సోప్ ను వినియోగిస్తూ ఉంటారు. ఇది కూడా అంత మంచిది కాదు. అలాగే, సువాసన గా ఉండాలని రకరకాల క్లీన్సర్ లను వినియోగిస్తూ ఉంటారు. ఇవి చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. వీటిని ఎక్కువ కాలం వినియోగించడం వలన ఇన్ఫెక్షన్ల బారిన పడాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి సున్నితమైన భాగాలను శుభ్రం చేసుకోవడానికి నీటిని ఉపయోగించాలి.

3 shaving

అండర్ ఆర్మ్స్, ప్రైవేట్ పార్ట్స్ వంటి చోట్ల చెడు వాసన రాకుండా కాపాడుకోవడం కూడా అవసరమే. అందుకే ఇలాంటి చోట్ల షేవింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి. ఈ ప్రాంతాలను శుభ్రం గా ఉంచుకోకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ గా వచ్చే అవకాశం ఉంటుంది.

4 periods

అలాగే, నెలసరి సమయం లో కూడా మరింత శుభ్రతను పాటించాల్సి ఉంటుంది. నాలుగు గంటలకు ఒకసారి అయినా పాడ్స్ ను మార్చుకోవాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు సోకె అవకాశం ఉంటుంది. ఇన్నర్ వేర్ వేసుకునేటపుడు కూడా పొడిగా ఉన్నవే వేసుకోవాలి. లేకుంటే ఇన్ఫెక్షన్లు సోకుతాయి. అలాగే కొత్త ఇన్నర్ వేర్ ని వెంటనే వేసుకోకుండా.. వాటిని ఒకసారి ఉతికిన తరువాతే వేసుకోవాలి. మీ నోటిని కూడా శుభ్రం గా ఉంచుకోవాలి. రోజుకు రెండు సార్లు చొప్పున బ్రష్ చేసుకోవడం, ఉప్పునీటిని పుక్కిలించడం వంటివి చేస్తూ ఉండాలి. తద్వారా ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా మీ నోరు శుభ్రం గా ఉంటుంది.


You may also like