ఉక్రెయిన్ లో కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.. కూతురుని పంపేస్తూ కన్నీటిపర్యంతమవుతున్న తండ్రి..!

ఉక్రెయిన్ లో కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.. కూతురుని పంపేస్తూ కన్నీటిపర్యంతమవుతున్న తండ్రి..!

by Anudeep

Ads

ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధ వాతావరణం ముదురుతున్న సంగతి తెలిసిందే. రష్యా దాడికి తెగబడడంతో ఉక్రెయిన్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ప్రాణాలు అరచేత పట్టుకుని అక్కడి ప్రజలు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు.

Video Advertisement

రష్యా అధ్యక్షుడు పశ్చిమ మరియు ఉక్రెయిన్‌ లు నాటోలో చేరబోమని మరియు ఉక్రెయిన్ సైనికరహితం చేసి తటస్థ రాజ్యంగా మారాలని హామీలు కోరుతున్నారు. ఈ విషయమై ఉక్రెయిన్ వెనక్కి తగ్గడంతో ఇరు ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

రష్యా సేన దాడికి దిగడంతో ఉక్రెయిన్ అల్లాడిపోతోంది. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెడుతున్నారు. మరోవైపు పిల్లలు ఉన్న వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. నానా తిప్పలు పడీ ప్రాణాలు కాపాడుకుంటే.. తిండి తిప్పలకి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది.

చాలా మంది ఏటీఎం కార్డులు పని చేయకపోవడం వలన కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దొరికన సరుకులు ఇంటికి కొనుక్కుని వెళ్లాలన్నా.. ఇంటికి వెళ్లేసరికి ఎటువైపు నుంచి దాడి జరుగుతుందో అన్న భయం నెలకొంది. ఈ పరిస్థితిల్లో ఓ తండ్రి ఈ యుద్ధం నుంచి తన కూతురుని కాపాడడానికి దూరంగా పంపిస్తున్నాడు. కూతురుని చూడకుండా ఉండగలనో లేదో అని ఆ వ్యక్తి పడుతున్న బాధ చూపరుల గుండెని మెలితిప్పుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.

Watch Video:


End of Article

You may also like