VYAVASTHA REVIEW : “హెబ్బా పటేల్” నటించిన వెబ్ సిరీస్ వ్యవస్థ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

VYAVASTHA REVIEW : “హెబ్బా పటేల్” నటించిన వెబ్ సిరీస్ వ్యవస్థ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Anudeep

Ads

  • వెబ్ సిరీస్ : వ్యవస్థ
  • నటీనటులు :కార్తీక్ రత్నం, హెబ్బా పటేల్, సంపత్ రాజ్, కామ్నా జఠ్మలానీ, గురురాజ్, రామారావు జాదవ్, శ్రీతేజ ప్రసాద్, సుకృతా వాగ్లే
  • నిర్మాత : పట్టాభి ఆర్. చిలుకూరి
  • దర్శకత్వం : ఆనంద్ రంగ
  • ఓటీటీ వేదిక : జీ 5
  • ఎపిసోడ్స్ : 7
  • విడుదల తేదీ : ఏప్రిల్ 28 , 2023Vyavastha -web series-story-review-rating

క‌థ‌:

Video Advertisement

శోభనం గదిలోకి పెళ్ళికొడుకు వెళ్లిన కాసేపటికి గన్ ఫైరింగ్ సౌండ్ వినపడుతుంది. పని మనుషులు వెళ్లే సరికి… యామిని (హెబ్బా పటేల్) చేతిలో గన్ ఉంటుంది. ఆమె ముందు రక్తపు మడుగులో కొత్త పెళ్ళికొడుకు. తన తరఫున వాదించడానికి ప్రముఖ లాయర్ అవినాష్ చక్రవర్తి (సంపత్ రాజ్)ను యామిని నియమించుకుంటుంది. అయితే, మొదటి వాయిదాలో న్యాయవాదిని మార్చుకోవాలని అనుకుంటున్నట్లు కోర్టుకు తెలియజేస్తుంది.

 

చక్రవర్తి కోర్టులో తనకు ఎదురే ఉండకూడదని తోటి మేటి న్యాయవాదులను భాగస్వాములుగా చేసుకుని చెక్‌మేట్ పేరుతో ఫర్మ్ ప్రారంభిస్తాడు. అటువంటి చక్రవర్తి దగ్గర జూనియర్ లాయర్ అయిన వంశీకృష్ణ (కార్తీక్ రత్నం) చేతిలో యామిని తన కేసు పెడుతుంది.

Vyavastha -web series-story-review-rating

తనను కాదని యామిని వెళ్ళడంతో చక్రవర్తి ఏం చేశాడు? యామిని కేసులో వంశి కూడా ఎందుకు అరెస్ట్ కావాల్సి వచ్చింది? చక్రవర్తి వంటి బలమైన న్యాయవాదితో ఢీకొని యామినిని ఈ కేసు నుంచి వంశీకృష్ణ బయటకు తీసుకు రాగలిగాడా? లేదా? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.

రివ్యూ:

కోర్టు రూమ్ డ్రామా అంటే బలమైన వాదనలు, యాక్షన్ సన్నివేశాలు ఉండాలని కాకుండా సింపుల్ కథాంశంతో సాగేలా రూపొందిన వెబ్ సిరీస్ ‘వ్యవస్థ’. ఇంట్రెస్టింగ్ సీన్‌తో సిరీస్ మొదల‌వుతుంది. త‌ను చెప్పాల‌నుకుంటున్న విష‌య‌మేంట‌నే విష‌యాన్ని డైరెక్ట‌ర్ ఫ‌స్ట్ సీన్‌తోనే రివీల్ చేసేశాడు. అయితే ఎలా ముందుకు తీసుకెళ‌తాడ‌నుకున్న క్యూరియాసిటీని క్రియేట్ చేశాడు.

Vyavastha -web series-story-review-rating

కానీ, స్క్రీన్ మీద సీన్లు చూస్తే అంత ఉత్కంఠ, ఉత్సుకత కలిగించవు. అందుకు ప్రధాన కారణం కోర్టు రూములోని వాదనల్లో, దర్శకత్వంలో బలం లేకపోవడమే! న్యాయ ‘వ్యవస్థ’లోనూ అమ్మాయిలను ఎర వేయడం, దౌర్జన్యం వంటి రెగ్యులర్ రొటీన్ అంశాలపై దర్శక, రచయితలు ఆధార పడ్డారు.

 

మ‌రో వైపు చ‌క్ర‌వ‌ర్తి పాత్ర‌కు, వంశీ కృష్ణ పాత్ర‌కు మ‌ధ్య ఉన్న ఇంట‌ర్నెల్ వైరాన్ని కూడా చ‌క్క‌గా చూపించారు. త‌న‌కు మాత్ర‌మే పేరు రావాల‌నే త‌లంపుతో చ‌క్ర‌వ‌ర్తి పాత్ర ఎంత వ‌ర‌కైనా వెళ‌తాడు అనే విష‌యాల‌ను కూడా చూపించారు. న్యాయ వ్య‌వ‌స్థ‌లో కొంద‌రు లాయ‌ర్లు కేసుల‌నున‌, క్లైంట్స్‌ను ఎలా త‌ప్పు దోవ ప‌ట్టిస్తుంటార‌నే విష‌యాల‌ను కూడా ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

Vyavastha -web series-story-review-rating

కానీ కథనం చాలా స్లో గా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. సినిమాటోగ్ర‌ఫీ, న‌రేష్ బీజీఎం వంటి బావున్నాయి. పాత్ర‌ధారుల విషయానికి వ‌స్తే సంప‌త్ రాజ్ క్యారెక్ట‌రైజేష‌న్‌ను బ‌లంగా చూపించారు. ఇక కార్తీక్ ర‌త్నం ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌ల కంటే ఇది త‌న‌కు మంచి పేరు గుర్తింపు తెచ్చే రోల్ ఇది. హెబ్బా ప‌టేల్, కామ్నా జెఠ్మ‌లానీ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేర‌కు చ‌క్క‌గా న‌టించారు.

 

ఇన్వెస్టిగేషన్ డ్రామా, కోర్ట్ రూమ్ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉండాలి? పిన్ టు పిన్… ప్రతిదీ పక్కాగా, లాజిక్కులతో ఉండాలి. స్క్రీన్ మీద సీరియస్‌నెస్ కనిపించాలి. కానీ ఈ సిరీస్ లో సోల్ మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది.

ప్లస్ పాయింట్స్:

  • సంపత్ రాజ్ రోల్
  • కొన్ని సీన్లు

Vyavastha -web series-story-review-rating

మైనస్ పాయింట్స్ :

  • కథ స్లోగా సాగడం
  • మధ్య మధ్యలో బోర్ కొట్టడం
  • లాజిక్ లు మిస్ అవ్వడం

రేటింగ్ :

2 .5 /5

టాగ్ లైన్ : 

ఒక్కసారి మాత్రమే చూడగలిగే కోర్ట్ డ్రామా

watch trailer :

Also read: JALLIKATTU REVIEW : ప్రముఖ దర్శకుడు “వెట్రిమారన్” నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like