ఏ స్టార్ హీరో జీవితంలోని వరుస సక్సెస్ సాధించడం అంత సులువైన విషయమేమీ కాదు. ప్రతి స్టార్ హీరోకి సినిమాకి సినిమాకి మధ్య ఎన్నో ఫ్లాపులు వస్తుంటాయి . అయితే కొంతమంది మన స్టార్ హీరోలు మాత్రం వరుస విజయాలతో హ్యాట్రిక్ కాకుండా డబుల్ హ్యాట్రిక్ ని సాధించారు. వాళ్లు అందుకున్న ఈ సక్సెస్ తో బాక్సాఫీస్ వద్ద తమ సత్తా ఏంటో చాటిచెప్పారు.
Video Advertisement
మరి డబల్ హ్యాట్రిక్ అందుకున్న మన తెలుగు టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో మనం కూడా చూసేద్దాం రండి..
#1: పవన్ కళ్యాణ్:
1997లో విడుదలైన గోకులంలో సీత చిత్రం నుంచి 2001 లో రిలీజ్ అయిన ఖుషి చిత్రం వరకూ డబల్ హ్యాట్రిక్ ని సంపాదించారు పవన్ కళ్యాణ్. గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ హిట్ అందుకోగా, తమ్ముడు, బద్రి, ఖుషి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఖుషి తర్వాత వచ్చిన జానీ చిత్రం ప్లాప్ తో పవన్ కళ్యాణ్ సక్సెస్ కి బ్రేక్ పడింది.
#2. చిరంజీవి:
మన మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లు ఉన్నాయి. కొన్ని చిత్రాలు మధ్యమధ్యలో ప్లాప్స్ రావడం ద్వారా హ్యాట్రిక్ ని బ్రేక్ చేశాయి. కానీ 1991-93 వరకు చేసిన గ్యాంగ్ లీడర్ నుంచి ముఠా మేస్త్రి చిత్రం వరకు వరుసగా హిట్ ను అందుకుని డబల్ హ్యాట్రిక్ సాధించారు చిరంజీవి.
#3. బాలకృష్ణ :
బాలకృష్ణ సినీ జీవితంలో 1986 సంవత్సరం ఎంతో కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఆయన నటించిన వరుసగా ఆరు చిత్రాలు విజయం సాధించి డబల్ హ్యాట్రిక్ ని అందుకున్నారు. ముద్దుల కృష్ణయ్య చిత్రం నుంచి భార్గవ రాముడు వరకు బాక్సాఫీస్ని షేక్ చేశారు బాలయ్య.
#4.వెంకటేష్ :
విక్టరీ వెంకటేష్ ప్రేమించుకుందాం రా చిత్రం నుంచి రాజా చిత్రం వరకు వరుసగా హిట్స్ అందుకొని డబల్ హ్యాట్రిక్ ని తన ఖాతాలో వేసుకున్నారు
#5. నాగార్జున :
నాగార్జున సంతోషం చిత్రం నుంచి శ్రీరామదాసు చిత్రం వరకు వరుసగా 7 చిత్రాలు సక్సెస్ సాధించి డబల్ హ్యాట్రిక్ ని అందుకున్నారు.
#6.జూనియర్ ఎన్టీఆర్:
మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ చిత్రం నుంచి RRR చిత్రం వరకు వరుసగా ఆరు చిత్రాలతో విజయం సాధించి డబల్ హ్యాట్రిక్ ని సొంతం చేసుకున్నారు.
#7. నాని :
నాచురల్ స్టార్ నాని ఎవడే సుబ్రమణ్యం చిత్రం నుంచి మిడిల్ క్లాస్ అబ్బాయి వరకు వరుసగా ఎనిమిది చిత్రాలతో సక్సెస్ సాధించి డబల్ హ్యాట్రిక్ ని సొంతం చేసుకున్నాడు. MCA తర్వాత వచ్చిన కృష్ణార్జున యుద్ధం ఈ చిత్రంతో నాని సక్సెస్ కి బ్రేక్ పడింది. కృష్ణార్జున యుద్ధం కూడా హిట్ అయి ఉంటే ఈ తరం హీరోలో త్రిబుల్ హ్యాట్రిక్ సంపాదించిన మొదటి వ్యక్తి గాని నిలిచిపోయి ఉండేవాడు.
మరి ఈ ఖాతాలోని మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఎందుకు చేర్చలేదు అనుకుంటున్నారా..
భరత్ అనే నేను చిత్రం నుంచి ఈ మధ్య కాలంలో విడుదలైన సర్కారు వారి పాట చిత్రం వరకూ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు మహేష్. ఆయన ఖాతాలో హ్యాట్రిక్ అయితే ఉంది కానీ, కొన్ని చిత్రాలకు మధ్యలో ఫ్లాప్ ను చవిచూశారు. మరి త్వరలో రాబోయే చిత్రాలతో విజయం సాధిస్తే మహేష్ కూడా డబల్ హ్యాట్రిక్ సంపాదించిన హీరోగా లిస్ట్ లో చేరిపోతారు.