హై హీల్ షూస్ ని కనిపెట్టింది ఆడవారి కోసం కాదట.. అసలు కథ ఏంటో చూడండి..!

హై హీల్ షూస్ ని కనిపెట్టింది ఆడవారి కోసం కాదట.. అసలు కథ ఏంటో చూడండి..!

by Anudeep

Ads

హై హీల్స్ అనగానే ఆడవారికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఎందుకంటే.. ఫ్యాషన్, యాక్సెసరీస్, అలంకరణ పైనా ఆడవారికే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ట్రెండీ జీన్స్ పైన చూడ చక్కని టాప్ వేసుకుని.. మాచింగ్ హీల్స్ వేసుకుంటే.. ఆ లుక్కే వేరు.. కొన్ని ట్రెడిషనల్ వేర్, ఎత్నిక్ వేర్ కి కూడా హీల్స్ సూట్ అవుతాయి. ఇలా హై హీల్స్ ఆడవారి ఫ్యాషన్ ప్రపంచం లో భాగం అయిపోయాయి.. కానీ, అసలు హై హీల్స్ ను కనిపెట్టింది ఆడవారి కోసం మాత్రం కాదట. దీని అసలు కథ ఏంటో చూద్దాం రండి..

Video Advertisement

high heels

మొట్ట మొదట గా హై హీల్స్ ను పురుషుల కోసమే రూపొందించారట. 10 వ శతాబ్దంలో పెర్షియన్ సైనికులు వారి పాదాలను పైకి లేపడానికి హై-హీల్డ్ బూట్లు మొదట ధరించారు. వారు విల్లు మరియు బాణాలను ఉపయోగించేవారు. ఈ సమయం లో వారికి పట్టుకోసం ఇలాంటి షూస్ ను ఉపయోగించారట. అప్పటి నుంచి వీటిపై పురుషులకు ఆసక్తి పెరిగి కొంతకాలం వరకు ట్రేండింగ్ లో కొనసాగాయట.

mens high heels 1

బాగా డబ్బున్న వారు, పెర్షియన్ సైనికులు, బాటసారులు వీటిని ఎక్కువ గా వినియోగించేవారట. లూయిస్ 15 వ రాజు కూడా కింగ్ ఆఫ్ హీల్స్ గా పిలవబడేవారట. అతను రకరకాల హీల్స్ ధరించేవారట. అయితే.. 1670 లో ప్రభువులు మాత్రమే హై హీల్స్ ధరించాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చారట. ఆయన ఎక్కువ గా ఎరుపు రంగు బూట్లు ధరించేవారట. ఆయనతో పాటు ఆయన సభ లో సభ్యులకు కూడా ఎరుపు రంగు బూట్లు ధరించడానికి అనుమతి ఉండేదట.

mens high heels 2

ఆ కాలం లోనే.. స్త్రీలు కూడా పురుషుల ఫ్యాషన్ ట్రెండ్స్ ను ఫాలో అవ్వడానికి ఆరాటపడ్డారు. హెయిర్ ను కత్తిరించుకోవడం, టోపీలు పెట్టుకోవడం వంటి వాటిని ఫాలో అవడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ క్రమం లోనే హై హీల్స్ ను స్త్రీలు కూడా ధరించడం ప్రారంభించారు. అయితే.. స్త్రీల పాదాలు పురుషుల పాదాల కంటే కొంత చిన్నవి గా ఉంటాయి. దీనితో.. వారికీ ప్రత్యేకం గా హీల్స్ ను రూపొందించడం ప్రారంభమైంది.

mens high heels 3

17 వ శతాబ్దం వచ్చేసరికి పురుషుల వస్త్రధారణ లో కూడా మార్పులు వచ్చాయి. వారు ఆకర్షణీయమైన రంగులు, ఆభరణాలు వంటివాటిని ధరించడం తగ్గించారు. మరో వైపు ఆడువారు వీటిని ధరిస్తూ వచ్చారు. దీనితో.. ఇద్దరి వస్త్రధారణ లోను బేధాలు వచ్చాయి. హై హీల్స్ ఎక్కువ స్త్రీలు వాడడం ప్రారంభించారు. 1740 నాటికి, పురుషులు హై హీల్స్ ను ధరించడం మానేశారు. 19 వ శతాబ్దం లో తిరిగి హీల్స్ పురుషులకు కూడా అందుబాటులోకి వచ్చినా.. తక్కువ ఎత్తు ఉన్న హీల్ షూస్ ని మాత్రమే పురుషులు వినియోగిస్తున్నారు.


End of Article

You may also like