ప్రతి కంపెనీ కి ఓ బ్రాండ్ సింబల్ కచ్చితం గా ఉంటుంది. ఈ సింబల్ అనేది వారి బ్రాండ్ ను సూచించే విధం గా డిజైన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పడు మనం పాపులర్ బ్రాండ్ సింబల్స్ అసలు అర్ధలేంటో తెలుసుకుందాం.

1. అమెజాన్:

1 amazon
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కంపెనీ తెలియంది వారెవరు ఉండరు. ఈ సింబల్ ఏమి ఉంది..? అమెజాన్ అని ఇంగ్లీష్ లో రాసి ఉంటుంది అంతే కదా అనుకుంటున్నారా..? అయితే మరో సారి జాగ్రత్త గా గమనించండి. ఈ సింబల్ స్మైల్ ను సూచిస్తుంది. అలాగే, “A” లెటర్ నుంచి “Z” లెటర్ వైపు ఉన్న యారో మార్క్ ను గమనించండి. అంటే ఈ సైట్ లో “A” నుంచి “Z” వరకు అన్ని వస్తువులు లభిస్తాయని అర్ధం.

2. యూనీలీవర్:

2 uniliver
యూనీలీవర్ కంపెనీ దాదాపు అన్ని రకాల ప్రోడక్ట్ లను అందిస్తోంది. ఫెయిర్ అండ్ లవ్లీ, లైఫ్ బాయ్, పెప్స్లోడెంట్, లక్మీ , సన్ సిల్క్, పాండ్స్.. ఇవన్నీ వేరు వేరు కంపెనీ లు కాదు. ఒకటే కంపెనీ. అదే యూనీలీవర్ కంపెనీ. ఇవన్నీ కనిపించే విధం గా నే ఈ లోగో ను డిజైన్ చేసారు. ఈ లోగో లో పెదాలు ఉంటాయి..అంటే ఇది బ్యూటీ ప్రొడక్ట్స్ ను సూచిస్తుంది. సన్ బొమ్మ కూడా ఉంటుంది.. అంటే సన్ సిల్క్ షాంపూ ను సూచిస్తుంది. ఇలా అన్ని ప్రొడక్ట్స్ ను సూచించే విధం గా ఈ లోగో ను డిజైన్ చేసారు.

3. టొయోటా:

3 toyoto
టొయోటా గురించి పరిచయం అవసరం లేదు. ఈ లోగో చూడ్డానికి చాలా చిత్రం గా కనిపిస్తుంది. ఈ లోగో ను సరిగ్గా గమనిస్తే.. ఈ లోగో లో ఉన్న లెటర్స్ అన్ని కనిపిస్తాయి. “Toyoto” లెటర్స్ అన్ని ఈ లోగో లు ఇమిడి ఉంటాయి.

4. ఎస్ బి ఐ:

4 sbi
భారత్ లోని పెద్ద బ్యాంకు ఎస్ బి ఐ. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనే లోగో. ఈ లోగో తెలుపు మరియు బ్లూ కలర్ లో ఉంటుంది. నీలం తో ఉన్న చిన్న వృత్తం మరియు నిలువు వరుస కీహోల్‌ను సూచిస్తుంది, ఇది భద్రత మరియు బలానికి ప్రతీక. మధ్యలో ఉన్న తెల్ల వృత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ను సూచిస్తుంది. నిలువు గా సన్నగా ఉన్న గీత పట్టణాలు మరియు నగరాల ఇరుకైన దారులను సూచిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఎక్కడికి వెళ్లినా మీకు సేవ చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఉంటుంది అనే అర్ధం వచ్చేలా ఈ లోగో ను డిజైన్ చేసారు.

5. ఆపిల్:

5 apple
ఆపిల్ లోగో కూడా అందరికి తెలిసినదే. అయితే ప్రస్తుతం ఉన్న లోగో చాలా మోడిఫికేషన్స్ తరువాత ఏర్పడింది. తొలుత చెట్టుకింద ఆపిల్ పండును చూస్తున్న న్యూటన్ లోగో ను ఉంచారు. స్టీవ్ జాబ్స్ కి ఈ లోగో నచ్చకపోవడం తో మార్పులు చేసారు. ఆపిల్ ను సగం కట్ చేసిన సింబల్ ను డిజైన్ చేసారు. తొలుత ఈ డిజైన్ లో కలర్స్ ఉండేవి. కాలక్రమం లో ఇది మారుతూ వస్తు ప్రెసెంట్ ఉన్న సింబల్ కి స్థిరపడింది.

6. ఆడి :

6 audi
ఆడి కారు కానీ, ఆడి లోగో గాని తెలియని వారెవరు ఉండరు. ఇందులో నాలుగు రింగ్స్ ఉంటాయి కదా. ఈ నాలుగు రింగ్స్ నాలుగు కంపెనీ లను సూచిస్తాయి. హార్చ్, ఆడి, డీకేడబ్లు, వాండెర్ లను సూచిస్తాయి. ఈ నాలుగు కంపెనీ లు 1932 కంటే ముందు విడిగా పని చేసేవి. ఆ తరువాత ఈ నాలుగు కలిసి ఆడి యూనియన్ గా కలిసి ఏర్పడ్డాయి. ఈ నాలుగు కంపెనీలను సూచించడానికి లోగో లో నాలుగు రింగ్స్ ను పెట్టారు.

7. డామినోస్:

7 daminos
డామినోస్ పిజ్జా కు కొత్త గా పరిచయాలు అవసరం లేదు. ఈ లోగో ను గమనిస్తే పైన మూడు డాట్స్ ఉంటాయి. అవేంటంటే.. మొదటి డాట్ డామినోస్ మొదటి బ్రాంచ్ కి గుర్తు గా, ఆ తరువాత వచ్చిన రెండు బ్రాంచెస్ కి రెండు డాట్ లను గుర్తు గా పెట్టారు. డామినోస్ వచ్చిన మొదట్లో.. ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ చేస్తే అన్ని డాట్స్ పెడదామని అనుకున్నారు. కానీ, వేల సంఖ్యలో బ్రాంచెస్ ను ఓపెన్ చేయడం తో ఇక డాట్స్ పెట్టలేమని భావించి, ఆ మూడు డాట్స్ ని అలానే వదిలేసారు. ప్రపంచవ్యాప్తం గా డామినోస్ కి 17 వేల కంటే ఎక్కువ గానే స్టోర్స్ ఉన్నాయి. తాజాగా, ఈ లోగో నుంచి పిజ్జా ను తీశారు. డామినోస్ అంటేనే పిజ్జా.. ఈ మాటను కొత్త గా చెప్పక్కర్లేదు అనే ఉద్దేశ్యం తోనే ఈ పిజ్జా అనే పదాన్ని తీసేసారు.

8. BMW (Bayerische Motoren Werke) :

8 bmw
BMW కార్ లకు ఉన్న డిమాండ్ తక్కువేమి కాదు. జెర్మనీ కి చెందిన బవేరియా లో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. ఆ పేరు మీదే ఈ కంపెనీ పేరుని పెట్టారు. ఈ లోగోలో రెండు కలర్లు ఉంటాయి కదా.. బ్లూ కలర్ మరియు వైట్ కలర్ ఉంటాయి. ఈ రంగులు ఆ దేశ జండా లో ఉంటాయి. అవే రంగులను ఈ కంపెనీ లోగో లో కూడా ఉంచారు.

9. హుండాయ్:

9 hunday
ఇది కూడా ఒక పాపులర్ కంపెనీ. ఈ లోగోను గమనిస్తే.. హుండాయ్ లో మొదటి అక్షరం అయిన హెచ్ ను లోగో గా పెట్టారని అందరు అనుకుంటారు. కానీ అసలు అర్ధం అది కాదు. ఇద్దరు వ్యక్తులు కరచాలనం చేసుకుంటూ ఉంటారు. వీరి లో ఒకరు హుండాయ్ కంపెనీ వ్యక్తి కాగా, మరోకరు కస్టమర్. వీరిద్దరి మధ్య సత్సంబంధాన్ని సూచిస్తూ ఈ లోగో ను డిజైన్ చేసారు.

10. పెప్సీ:

10 pepsi
పెప్సీ కంపెనీ తన లోగో ను డిజైన్ చేయించుకోవడానికి వన్ మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. ఈ లోగో లో ఉన్న రంగులు అమెరికన్ నేషనల్ ఫ్లాగ్ ను సూచిస్తాయి.

11. మెక్ డొనాల్డ్స్:

11 meckdonalds
మెక్ డొనాల్డ్స్ లోగో చూడగానే ఫస్ట్ లెటర్ “m” ను లోగో గా పెట్టారని అనుకుంటారు. కానీ దీనికి వేరే కథ ఉంది. ఈ కంపెనీ మొదటి బ్రాంచ్ ను పెట్టినపుడు ఆ బిల్డింగ్ కి ఎల్లో కలర్ ఆర్క్ లా డిజైన్ చేసారు. ఆ తరువాత పెట్టిన అన్ని బ్రాంచెస్ కి ఇలానే పెట్టారు. ఆ ఆర్క్ లను దగ్గరకి చేస్తే ఆ లోగో “m” ఆకారం లో వచ్చింది.

12. నైక్:

12 nike
ఈ లోగో కింద టిక్ మార్క్ ఉంటుంది కదా.. అంటే దీని అర్ధం స్పీడ్ అని. అథ్లెట్స్ కి కావాల్సిన వేగాన్ని ఈ కంపెనీ షూస్ అందిస్తాయని అర్ధం.

13. ఎయిర్టెల్:

13 air tel
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ లోగో ఆ పదం లోని మొదటి అక్షరాన్ని సూచిస్తుంది. కానీ, ఇందులో కంపెనీ చూపిన అర్ధం ఏమిటంటే.. ఈ “a” అనే లెటర్ సగమే ఉంటుంది. మధ్యలో భాగం ఓపెన్ గా ఉంటుంది. అంటే ఎయిర్ టెల్ కు ఎలాంటి బౌండరీస్ లేవు అని అర్ధం.