Ads
మీరు ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతం గా ఉన్నారా? అలా ఉంటె.. ఈ కధ ను చదవండి. చాలా కాలం క్రితం, ఖోంగ్ లాంగ్ సరస్సు ఒడ్డున ఉన్న ఆధ్యాత్మిక రాజ్యమైన రాప్పాటా నాఖోన్ లో ఓ సంఘటన జరిగింది. ఆ రాజ్యం లో ప్రిన్స్ ఫహూంగ్ చాలా పొడవైన, బలమైన మరియు అందమైనవాడు. రాజ్యంలోని ప్రతి మనిషీ అతనితో స్నేహం గా ఉండేవాడు. దీనితో అతనికి చాలా ఎక్కువ గర్వం గా ఉండేది, మరియు అమ్మాయిలందరూ అతని అద్భుతమైన చిరునవ్వును మరియు అతని లోతైన నీలి కళ్ళలోని మెరుపును చూసి ఇష్టపడేవారు. కానీ,ఫహూంగ్ మాత్రం ఒంటరిగా ఉన్నాడు.
Video Advertisement
అతను ప్రపంచంలోని దొరికే అన్నిటిని కొనగలిగే ధనం అతని వద్ద ఉండేది. కానీ అతనికి కావాల్సింది ఏమిటో తెలిసేది కాదు. అతని నిజమైన ప్రేమని ఎవరు అర్ధం చేసుకోవడం లేదని అతనికి అనిపించేది. నిజమైన ప్రేమను అర్ధం చేసుకునే వారు, పంచుకొనే వారు ఎవరు లేనప్పుడు ఎంత ధనం ఉండి ఏమి ప్రయోజనం? అని భావిస్తూ ఉండేవాడు.
ఒకరోజు అతను అడవిలో నడుస్తూ ఉండగా… ఒక అమ్మాయి పాటను పాడటాన్ని గమనించాడు. ఆపాట ఎంతో శ్రావ్యం గాను, ఆమె బాధను వెళ్లగక్కుతూ పాడుతున్నట్లు ఉండి. ఈ యువరాజు ఆ పాట వినిపిస్తున్న వైపుకు వెళ్ళాడు. ఎంతదూరం వెళ్లినా ఆమె కనిపించలేదు. అయితే, క్రమం గా పాట వినిపించడం ఆగిపోయింది. ఇంతలో ఒక అమ్మాయి ఏడుస్తున్నట్లు వినిపించసాగింది. ఆ అమ్మాయి కనిపించకపోవడం తో, యువరాజు వెనక్కి వచ్చేయాలనుకుంటాడు. కానీ.. ఆ పాట పాడిన అమ్మాయే ఏడుస్తోందని అర్ధం చేసుకుంటాడు. ఆ మృదువైన గొంతుకతో పాట పాడుతున్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు. ఇంతలో తన వెనుకగా మెరుపు వేగం తో ఎదో కదిలినట్లు అనిపిస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి చూడగా, తన పాదాల వద్ద పాము చర్మం కనిపిస్తుంది.
అంతకు కొద్దిసేపటి క్రితమే ఒక పాము తన కుబుసాన్ని వదిలి పెట్టేసింది అని యువరాజుకు అర్ధం అవుతుంది. అయితే, ఈ పాము కుబుసం చాలా విచిత్రం గా ఉంటుంది. అంతకుముందు అతను అలాంటివి ఎన్నో చూసినప్పటికీ, ఇది మాత్రం చాలా విచిత్రం గా ఉంటుంది. ఈ పాము చర్మం ఒకవైపు ఎరుపు రంగులోను, మరొక వైపు ఆకుపచ్చ రంగులో ను ఉంటుంది.
అతనికి ఇది అర్ధం కాక, తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు. తన రాజ్యం లో అత్యంత తెలివైన వాడు అయిన తన తాతను తానూ అడవి లో చుసిన దానిని గురించి అడుగుతాడు. అయితే, అందుకు గల కారణం తెలుసుకోలేకపోతాడు. మరో వైపు, ఆ పాము చర్మం ఒక నాగిని ది. ఆమె యువరాజును చూడగానే తోలి చూపులోనే ప్రేమిస్తుంది. కానీ అతను మానవుడు, తనేమో నాగి. వారిద్దరికీ వివాహం జరగడం సాధ్యపడదు కాబట్టి ఆమె విచారం వ్యక్తం చేసింది. అది అతని కి ఎదురుగా వెళ్లి చెప్పలేక దూరం గా ఉండిపోతుంది. అయితే ఇవేమి తెలియని యువరాజు మరుసటి రోజు ఆమెను వెతుకుతూ అక్కడకి వస్తాడు. ఆమె కూడా ధైర్యం చేసి అతనికి చెప్పాలనుకుంటుంది. మానవ కన్య రూపం లో అతనికి కనిపిస్తుంది. వారిద్దరూ ఇష్టపడతారు.
అయితే, అతని మంచి తనాన్ని తెలుసుకున్న “నక్కరింత్రాణి” అనే నాగి తన అసలు రహస్యం గురించి చెబుతుంది. తానూ ఒక నాగి అని, తనకు మానవ రూపం, సర్ప రూపం ఉంటాయని.. తానూ అతన్ని ప్రేమిస్తున్నానని చెబుతుంది. యువరాజు మొదట షాక్ అయినా.. ఆమె ప్రేమకు దాసోహం అంటాడు. రాజ్యానికి తీసుకు వెళ్లి తన తాత కు చూపించి.. వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు చెబుతాడు. నక్కరింత్రాణి తండ్రి నాగులకు మహారాజు.. యువరాజు తాత, నక్కరింత్రాణి తండ్రి తో చర్చలు జరిపి వివాహానికి అంగీకరిస్తారు. అయితే, ఒక షరతు విధిస్తారు. ఒకవేళ ఆమె నాగి అన్న సంగతి రాజ్యం లో ఎవరికైనా తెలిస్తే.. ఆ ఇద్దరినీ రాజ్యం నుంచి బహిష్కరిస్తామని చెబుతాడు.
ఆమె నాగి అన్న సంగతి బయటకు తెలియకుండా కాపాడుకోవాలని చెబుతాడు. నక్కరింత్రాణి తండ్రి కూడా కొన్ని షరతులు పెట్టి పెళ్ళికి అంగీకరిస్తాడు. తన కూతురు నాగి అన్న సంగతి బయటకు పొక్కితే.. రాజ్యం మొత్తాన్ని ఆనవాళ్లు లేకుండా నాశనం చేస్తాను అంటాడు. ఈ షరతులకు అంగీకరించి ఫహుంగ్ మరియు నాగి వివాహం చేసుకుంటారు. మూడు సంవత్సరాలు వారి జీవితం ఆనందం గా గడిచిపోతుంది. ఎంతకాలం గడుస్తున్నా, నాగికి వారసుడు పుట్టకపోవడం తో ప్రజలు అసంతృప్తిగా ఉంటారు. మరో వైపు అంతఃపురం లోనే, యువరాజు ఖులాన్ అనే ఒక అమ్మాయి రహస్యం గా ప్రేమిస్తూ ఉంటుంది. ఆమె యువరాజుని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ అంతలోనే యువరాజు మరొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం తో.. ఆమె చేసేది లేక అంతః పురం లోనే దాసీ గా ఉండిపోతుంది.
ఒకరోజు, దాసీ గా ఉన్న ఖులాన్ ఫహుంగ్ పడక గది నుంచి..రాత్రి తిన్న ప్లేట్ లను తీసుకురావడానికి వెళుతుంది. అక్కడ మంచం పై నాగి ఉండదు. ఆమె పడుకుని ఉండాల్సిన స్థానం లో ఒక పెద్ద పాము ఉంటుంది. నాగి ఆ సమయం లో సర్ప రూపం ధరించి ఉంటుంది. ఆమె నుంచి హిస్..అన్న శబ్దాన్ని రావడం ఖులాన్ వింటుంది.ఒక్కసారి గా మంచం పై పాముని చూసేసరికి ఆమె కంగారు పడుతుంది. అయితే.. నాగి మాత్రం.. “కంగారు పడకు.. నేను మీ యువరాణిని.. నక్కరింత్రాణి ని అని చెబుతుంది.” దీనితో హతాశురాలైన ఖులాన్ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి ఈ విషయాన్నీ యువరాజుకు చెప్పాలనుకుంటుంది. యువరాజు భార్య ఒక పాము.. అంటూ అరుస్తూ వెళ్తుంది.
అదే రోజు యువరాజు పుట్టినరోజు కావడం తో.. వేడుకలకు నక్కరింత్రాణి తండ్రిని కూడా యువరాజు ఆహ్వానిస్తాడు.ఆ సమయం లో అక్కడకి వచ్చిన నక్కరింత్రాణి తండ్రి ఖులాన్ అన్న మాటలను విని.. ఈ విషయం అందరికి తెలిసిపోవడం తో ఆగ్రహానికి గురి అవుతాడు. దీనితో, తన రాజ్యం నుంచి నాగులను పిలిపించి రాప్పాటా రాజ్యం పై దాడి చేస్తాడు. ఫలితం గా రాజ్యం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. రాజ్యానికి సమీపం లో ఉన్న అడవి లోను, లోయల్లోను పడిపోయి చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. అయితే, యువరాజు మరియు నాగి మాత్రం వారి ప్రేమను వదులుకోరు. ఇద్దరు కలిసి అడవి లోకి పారిపోయి ఓ గుహ లో తలదాచుకుంటారు. ఆ గుహ నే ప్రస్తుతం నాకా కేవ్స్ గా పిలుస్తుంటారు. థాయిలాండ్ భాష లో నాకా అంటే..నాగ అని అర్ధం.. వీరిద్దరూ అక్కడే ఉండి..తిండి తిప్పలు లేక మరణిస్తారు. మరణం ఆసన్నమైనా,వారిద్దరూ ప్రేమ గా నే ఉంటారు. ఈ గుహ మొత్తం బయటా లోపలా కూడా పాము కుబుసమే ఉంటుంది.. అందుకే నాగ గుహలుగా వీటిని పిలుస్తారు..
థాయ్‌లాండ్‌లోని బ్యూంగ్ కాన్ ప్రావిన్స్‌లోని బ్యూంగ్ ఖోంగ్ లాంగ్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఫు లాంగ్కా నేషనల్ పార్క్‌లో మీరు నాగా కేవ్స్ ను చూడవచ్చు. నేషనల్ పార్క్‌లో మూడు పర్వతాల పొరలు ఉన్నాయి, ఇవి మెకాంగ్ నది వెంట విస్తరించి ఉన్నాయి. ఒక ప్రసిద్ధ పర్యాటక కాలిబాట ఫా న్గోయి పైభాగానికి దారితీస్తుంది, ఈ మార్గం లో వెళితే భన్ ఫెంగ్ జిల్లా మరియు మీకాంగ్ నది యొక్క అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు. చాయ్ మోంగ్ కోన్ ఆలయంలో నుంచి ప్రయాణం ప్రారంభిస్తే, మొదట రాతి మెట్లపైకి ఎక్కాలి, ఈ భాగం ఇరు వైపులా పాము చర్మాన్ని పోలినట్లు కనిపిస్తుంది. ఈ మార్గం ద్వారా పైకి చేరుకుంటే మురికి ప్రదేశం వస్తుంది. ఈ ప్రదేశమే గుహకు ప్రారంభ మార్గం. ఆ దారిలోనే ముందుకు వెళితే నాగా గృహాలకు చేరుకోవచ్చు. అయితే, కరోనా కారణం గా ప్రస్తుతం విజిటర్స్ ను అనుమతించడం లేదు..
watch video:
End of Article