రాచరికపు వ్యవస్థ అనేది భారతీయులకు ఎప్పటినుంచో పరిచయం ఉన్నదే. ఈ ప్రజాస్వామ్యాలు, ఎన్నికలు ఇవేమి లేకముందు రాజుల కాలం లో క్షత్రియులు రాజ్యాలను పరిపాలించేవారు.. అయితే, ఏ ఏ రాజులు ఏయే ఏయే కాలాలలో పరిపాలించారో కూడా మనకు చరిత్ర చెబుతూ ఉంటుంది. ఆయా రాజులకు సంబంధించి విగ్రహాలు, ఇతర చిత్ర పటాలు వంటివి కూడా మనకి అందుబాటులోనే ఉన్నాయి.

Video Advertisement

horses and kings code

రాజుల స్మృతి చిహ్నాలు ఉండే చోట.. చాలా చోట్ల విగ్రహాలు ఏర్పాటు చేసి ఉంటారు కదా. గుర్రాల పై కూర్చుని ఉన్న విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తూనే ఉంటారు. మీరు గమనించారా..? ఈ గుర్రాల పై కూర్చున్న విగ్రహాలు అందరి రాజులకు ఒకేలా ఉండవు. ఇలా ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా..? చాలా విగ్రహాలలో యుద్ధం లో రాజు ఎలా ఉంటాడో అన్న స్టయిల్ లో రూపొందిస్తూ ఉంటారు. చేతిలో కత్తి, డాలు తో గుర్రం పై కూర్చుని పోరాడడానికి సిద్ధం గా ఉన్న సింహం లా కనిపిస్తూ ఉంటారు. అయితే, రాజుల స్టయిల్ ఇంచుమించు ఒకే విధం గా కనిపించినా.. వారు కూర్చున్న గుర్రపు విగ్రహం తీరు మాత్రం ఒకేలా ఉండదు.

two legs horse

ఎందుకంటే, ఆ రాజులు ఎలా చనిపోయారో.. ఆ విగ్రహం చెబుతుంది కాబట్టి. ప్రతి విగ్రహం లోను గుర్రం స్టయిల్ భిన్నం గా ఉంటుంది.ఆ గుర్రం నుంచున్న విధానాన్ని బట్టి ఆ రాజు ఎలా చనిపోయారో చెప్పచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి రాజు కూర్చున్న గుర్రం రెండు కాళ్లు గాల్లోకి లేపి ఉంటే ఆ రాజు యుద్ధం చేస్తూ.. కదనరంగం లోనే వీరమరణం పొందాడని అర్ధం.

rudrama

అదే ఆ గుర్రానికి ఒక కాలు మాత్రమే పైకి లేపి ఉంటె.. యుద్ధం లో బాగా దెబ్బలు తగిలి, ఆ గాయాల కారణం గా మరణించిన రాజులకు గుర్రాన్ని ఈ విధం గా చెక్కుతారు. మీరెప్పుడైనా రుద్రమ దేవి విగ్రహం గమనించారా..? ఆమె విగ్రహం లోని గుర్రానికి ఒక కాలు పైకి లేపి ఉంటుంది.. అంటే ఆమె యుద్ధం లో గాయపడి.. యుద్ధం ముగిసాక ఆ గాయాల కారణం గా మరణించింది. చివరిగా, అంబదేవుని తో రుద్రమ దేవి యుద్ధం చేసింది. ఈ యుద్ధం లోనే గాయాల బారిన పడి.. కోలుకోలేక మరణించింది.

legs on earth horse

అలాగే, ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ సింగ్ లు కూడా యుద్ధం తరువాత గాయాలతో బాధపడి మరణించారు. అదే గుర్రానికి రెండు కాళ్లు నేల మీదే ఉంటె.. ఆ రాజు సహజ మరణం పొందాడని అర్ధం.