1965 నాటి “హోటల్ బిల్” చూసారా..? అప్పటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?

1965 నాటి “హోటల్ బిల్” చూసారా..? అప్పటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?

by Anudeep

Ads

ప్రస్తుత కాలం లో ప్రతి ఒక్కరు కూడా ఆహారాన్ని వ్యాపారంగా చేసి అమ్ముతున్నారు. ఒక రెస్టారెంట్ కి ముగ్గురు కలిసి వెళ్లి తినాలంటే రూ. 1000కి తక్కువ కాదు. ఫుడ్ బిల్లుకు తోడుగా అదనపు ట్యాక్సులు కూడా ఉంటాయి. పాలు, గ్యాస్, ఆయిల్ ధరలు పెరగడంతో.. రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఫాస్ట్ ఫుడ్ ఆపరేటర్లు కూడా ధరలను పెంచుతున్నారు. ధరల పెంపు భారాన్ని వినియోగదారులపై ప్రయోగిస్తున్నారు. కొందరికి ఇదేమంత భారం కాదు. అయితే చాలా మందికి ఇది భరించలేని ఖర్చే.

Video Advertisement

సాధారణంగా ఇంట్లో చేసిన ఫుడ్ కి రుచి,ఆరోగ్యం కూడా. కానీ ఈ మధ్య కాలంలో బయట తినడానికే అందరు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. జాబ్ టెన్షన్ వల్ల కావచ్చు, ఇతర పనుల వల్ల రెస్టారెంట్లలో తినేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. కొందరు లగ్జరీ కోసం బయటకు వెళ్లి తింటుంటారు. అయితే ప్రస్తుతం ఆ టాక్స్ లు, ఇవి అంటూ రేట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే ఇప్పుడు ఒక్కో రెస్టారెంట్లో వారికి నచ్చినట్టు రేట్స్ పెట్టుకుంటున్నారు.

olden days food prices in hotels..

కానీ ఇదివరకు కాలం లో ప్రజలు బయటకు వెళ్లి తినడం తక్కువే.. అలాగే అప్పట్లో హోటల్స్ లో ఫుడ్ రేట్స్ కూడా చాలా తక్కువగా ఉండేవి. అయితే 1965 లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన కారణంగా..అన్ని హోటల్స్ లో టిఫిన్స్ ధరలు పెంచుతున్నట్లు రేపల్లె లోని హోటల్స్ యజమానులు అందరు కలిసి పామ్ ప్లేట్స్ ప్రింట్ చేసి పంచారు. ఇప్పుడు ఆ పామ్ ప్లేట్ ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అప్పట్లో ఉన్న టిఫిన్స్ ధరలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

olden days food prices in hotels..

అందులో ఏముందంటే ..” నవంబర్ 1 , 1965 నుంచి పెరిగిన రేట్లు, అధిక ధరల కారణంగా రేపల్లె హోటల్ యజమానులు అందరూ సమావేశమై.. రేట్లు సవరించిన కారణంగా..నవంబర్ 1 నుంచి ఈ క్రింది విధంగా పెంచాము. అందరూ సహకరించండి.” అని ఆ కింద టిఫిన్స్ రేట్స్ ఇచ్చారు. అందులో 2 ఇడ్లి 15 పైసలు, అట్టు 15 పైసలు, ఉప్మా 15 పైసలు, రవ్వ అట్టు 20 పైసలు, 2 గారెలు 15 పైసలు, బోండా 20 పైసలు, కాఫీ, టీ 15 పైసలు ఇలా ఉన్నాయి అందులో ధరలు. ఆ ధరలు చుసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


End of Article

You may also like