Ads
ప్రస్తుతం ఎక్కడ చూసిన కరోనా గురించిన చర్చే.. ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే రోగ నిరోధక శక్తీ పుష్కలంగా ఉండాలి. మనం తీసుకునే ఆహరం ద్వారానే మన శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తీ అందుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయుర్వేదం లో రోగనిరోధక వ్యవస్థను మాడ్యులేట్ చేసే అనేక మందులు ఉన్నాయి, వీటిలో విటమిన్ సి మరియు డి వంటి విటమిన్లు, అమైనో ఆమ్లాలైన లైసిన్ మరియు అర్జినిన్ మరియు జింక్ వంటి ఖనిజాలు ఉన్నాయి. అలాగే అనేకరకాల మూలికలు కూడా ఉన్నాయి.. కరోనా మహమ్మారి బెడద ప్రారంభమైన మొదట్లో చాలామంది వీటిని తీసుకున్నారు. ఆ తరువాత క్రమం గా వీటిని తీసుకోవడం తగ్గించేశారు.
Video Advertisement
ప్రస్తుతం ఎక్కువ మంది టీకాలపైనే డిపెండ్ అవుతున్నారు. అయితే.. ఆయుర్వేదం లో కూడా మందులు పూర్తి గా కరొనను నిర్ములిస్తున్నాయని ప్రూవ్ కాలేదు. దీనితో ఎక్కువ మంది టీకాపైనే ఆధారపడుతున్నారు. అయితే, ఆయుర్వేదం మందులు వాడడం ద్వారా మీ శరీరం లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. తద్వారా.. మీ శరీరం దృఢం గా ఉండి కరోనా పై ఫైట్ చేయగలుగుతుంది.
End of Article