మన దేశం ఎన్నో సంప్ర‌దాయాల‌కు మరెన్నో న‌మ్మ‌కాల‌కు నెల‌వు.అయితే ప్రజలు కొన్నింటిని ఎక్కువగా నమ్ముతుంటారు. అలాగే హిందూ సాంప్రదాయంలో శకున శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. కునాల గురించి ఆదికాలం నుంచే విశ్వాసాలున్నాయి. వాటిలో కాకి శకునం ఒకటి.

Video Advertisement

కాకి త‌న్నితే అప‌శ‌కునం మ‌నే మూఢ న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో బలంగా నాటుకుపోయింది. కాకి త‌ల‌పై త‌న్నితే మ‌ర‌ణ వార్త వింటార‌ని.. ఏడేళ్ల పాటు శని తాండ‌విస్తుంద‌ని కూడా అంటూ ఉంటారు. కాకి మ‌న పితృ దేవ‌త‌ల ప్ర‌తినిధి అని హిందూ ధ‌ర్మాలు తెలియ‌జేస్తున్నాయి.

క‌ర్మ‌లు చేసేట‌ప్పుడు కాకి వ‌చ్చి మ‌నం పెట్టిన పిండాల‌ను తింటేనే చ‌నిపోయిన వారి ఆత్మ‌కు శాంతి క‌లుగుతుందని మ‌నలో చాలా మంది గాఢంగా న‌మ్ముతారు. మ‌న పూర్వీకులు కాకుల రూపంలో మ‌న ఇంటి చుట్టూ తిరుగుతార‌నే విశ్వాసం కూడా ఉంది.

unknown facts about crow..!!

వివిధ సంద‌ర్భాల‌లో కాకి ప్రవ‌ర్తించే తీరును బ‌ట్టి శుభ‌, అశుభ శ‌కునాలు ఉంటాయ‌ని మ‌న పెద్ద‌లు నిర్ణ‌యించారు. ఆ శకునాల గురించి, వాటి వ‌ల్ల క‌లిగే ఫ‌లితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

#1 శకున శాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పు లేదా పైకప్పు మీద కాకులు వాలడం శుభ పరిణామంగా భావిస్తారు.

#2 ఒక కాకి నీరు తాగుతూ మనకి కనిపిస్తే అది చాలా శుభప్రదమని చెప్పొచ్చు. మీరు సమీప భవిష్యత్తులో బాగా డబ్బు సంపాదించబోతున్నారని లేదా మీరు ఏదైనా పనిలో గొప్ప విజయాన్ని పొందబోతున్నారనే దానికి అది సంకేతం.

unknown facts about crow..!!

#3 మ‌న ఇంటి మీద లేదా ఇంటి ముందు కాకి అరిస్తే మ‌న ఇంటికి బంధువులు వ‌స్తార‌ని న‌మ్ముతారు.

#4 మ‌నం బ‌య‌ట‌కు వెళ్లున‌ప్పుడు కాకి కుడి వైపు నుండి ఎడ‌మ వైపుకు వ‌స్తే ఆ ప‌ని దిగ్విజ‌యంగా జ‌రుగుతుంది. ఒక‌వేళ కాకి గ‌న‌క ఎడ‌మ వైపు నుండి కుడి వైపుకు వ‌స్తే అశుభం క‌లుగుతుంది.

unknown facts about crow..!!

#5 కాకి నోటిలో ఆహారం లేదా రొట్టె ముక్కతో కూర్చోవడం లేదా ఎగురుతున్నట్లు మీరు చూస్తే, అది కూడా మంచిదని భావిస్తారు. శకున శాస్త్రం ప్రకారం, ఈ స్థితిలో కాకులు కనిపిస్తే… త్వరలోనే మీ అతిపెద్ద కోరిక నెరవేరబోతుందని అర్థం.

#6 మన ఇంటివద్ద కొన్ని కాకులు గుమికూడి.. పోట్లాడుకుంటూ ఉన్నట్లయితే అశుభం. అంటే ఆ ఇంటి యజమానికి త్వరలో కష్టాలు తప్పవన్నమాట.

unknown facts about crow..!!

#7 ఏదైనా ముఖ్యమైన పని పై వెళ్తున్నప్పుడు మూడు కాకులు ప్రశాంతం గా కూర్చొని ఉంటే.. ఆ పని దిగ్విజయం గా పూర్తి అవుతుందని నమ్మకం.

#8 భోజనం చేసేటపుడు చేతిలోని ముద్ద జారిపోయి.. అది కాకి తింటే మన కోరికలు త్వరలోనే తీరబోతున్నాయని అర్థం.

#9 అలాగే మనం ఎవరికైనా ఇచ్చిన అప్పుని వసూలు చేయడానికి వెళ్తున్నపుడు కాకి మన తలపై ఉంచి ఎగిరిపోతే ఆ అప్పు వసూలు అవుతుందట.

unknown facts about crow..!!

#10 ఇంటి నుంచిబయటకు వెళ్తున్నప్పుడు కాకి ఒకసారి అరిస్తే అది శుభశకునమట.

#11 ఇంటి కప్పు పై లేక గడ్డి వాము పై కాకి కూర్చొని అరిస్తే ధన లాభం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

unknown facts about crow..!!

#12 కాకి నోటితో గడ్డిపోచ పట్టుకొని వెళ్తూ కనిపిస్తే ధనం, వస్తు లాభం జరుగుతుందట.