ట్రైన్ “ట్రాక్” మారబోతుంది అని డ్రైవర్‌కి ఎలా తెలుస్తుంది.? అదే సమయానికి ఎలా స్లో చేస్తారు..?

ట్రైన్ “ట్రాక్” మారబోతుంది అని డ్రైవర్‌కి ఎలా తెలుస్తుంది.? అదే సమయానికి ఎలా స్లో చేస్తారు..?

by Anudeep

Ads

రైలు ప్రయాణం ఎవరికైనా అందమైనదే.. అందరూ ట్రైన్ జర్నీని ఆస్వాదిస్తారు. దేశంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి ఇదే ఉత్తమ సాధనం. తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అంతే కాకుండా సుఖ వంతంగా ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. అందుకే లాంగ్ జర్నీ లు అయినా.. సాధారణ ప్రయాణాలు అయినా చాలా మంది ట్రైన్ జర్నీ కే ఓటేస్తారు. అయితే ఇండియన్ రైల్వేస్‌ను దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్ను అని చెప్పొచ్చు. నిత్యం లక్షల మంది రైల్వే ప్రయాణం చేస్తుంటారు.

Video Advertisement

అయితే మనం ఎక్కిన ట్రైన్ స్టేషన్ దగ్గరికి వచ్చేటపుడు ఏ ప్లాట్ఫామ్ మీదకి రావాలన్నా ట్రాక్స్ మారాల్సి ఉంటుంది. అయితే ట్రైన్ ట్రాక్స్ ఎలా మార్చుకుంటుందన్న విషయం మనకి తెలియదు. ఇప్పుడు అది చూద్దాం..రైలు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విషయాలను పెద్దగా గుర్తించము. రైల్వే ట్రాక్‌లపై, క్రాసింగ్‌ల వద్ద కొన్ని బోర్డులను ఏర్పాటు చేస్తుంది భారతీయ రైల్వే.. అలా ట్రైన్ ట్రాక్స్ పక్కన ఏర్పాటు చేసిన సిగ్నల్స్ ఆధారం గా లోకో పైలట్ ట్రైన్ ని ఆపరేట్ చేస్తారు.

how train track changes..

 

ట్రైన్ ట్రాక్ మార్చాల్సి వచ్చినపుడు వరుసగా రెండు పసుపు రంగు సిగ్నల్స్ లోకో పైలట్ కి కనిపిస్తాయి. అప్పుడు ఆ తర్వాత వచ్చే ఎల్లో సిగ్నల్ కి ట్రాక్ మారుతుందని లోకో పైలట్ కి తెలుస్తుంది. అప్పుడు లోకో పైలట్ ట్రైన్ స్పీడ్ ని తగ్గిస్తాడు. ట్రాక్ మారేటప్పుడు ట్రైన్ స్పీడ్ 30 kmph లోపు ఉండాలి. ఆ సిగ్నల్స్ ఆధారం గా లోకో పైలట్ స్పీడ్ తగ్గించినపుడు.. రైల్ రోడ్ స్విచ్ అనే మెకానిజం ద్వారా ట్రైన్ ట్రాక్ మారుతుంది. దీనిలో లోకో పైలట్ ప్రమేయం ఉండదు. రెండు ట్రాక్ లను కలిపినపుడు ట్రైన్ ట్రాక్ మారుతుంది, రెండు ట్రాక్ లు విడిగా ఉన్నప్పుడు ట్రైన్ నేరుగా వెళ్ళిపోతుంది.

how train track changes..

అలాగే ట్రైన్ పట్టాలు తుప్పు పట్టకుండా ఒక టెక్నిక్ ఉపయోగిస్తారు. రైల్వే ట్రాక్స్‌ ఇనుముతో చేసేవే అయినప్పటికీ.. వాటికి వినియోగించే ఉక్కు అధిక నాణ్యత కలిగి ఉంటుంది. ఈ ఉక్కులో 1 శాతం కార్బన్, 12 శాతం మాంగనీస్ కలిసి ఉంటుంది. అందుకే దీనిని ‘సి-ఎంఎన్’ రైల్ స్టీల్ అని పిలుస్తారు. దీని కారణంగా తుప్పు పట్టడం చాలా తక్కువ అని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఒకవేళ తుప్పు పట్టినా.. తుప్పు రేటు సంవత్సరానికి 0.05 మి.మీ ఉంటుందట. అంటే 1 మి.మీ మేర తుప్పు పట్టడానికి 20 సంవత్సరాలు పడుతుంది.


End of Article

You may also like