Ads
Mythology

ద్రౌపది తన ఐదుగురు భర్తలతో ఎలా కాపురం చేసేదో తెలుసా..? ద్రౌపది గురించి ఎవరికీ తెలియని విషయాలు..!

Published by
Lakshmi Bharathi

మహాభారతం లో ఒక్కో పాత్ర కి ఒక్కో విశిష్టత ఉంది. పాండవులను వివాహమాడిన ద్రౌపది గురించి పరిచయం అవసరం లేదు. కానీ ఆమె గురించిన చాలా విషయాలు మనకు తెలియవు. అవేంటో.. ఆమె తన ఐదుగురు భర్తలతోను ఎలా కాపురం చేసేదో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేదో ఈరోజు తెలుసుకుందాం.

అర్జునుడు స్వయంవరం లో ద్రౌపదిని గెలుస్తాడన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత అర్జునుడు ఆమెను కుంతి వద్దకు తీసుకెళ్తాడు.. తాను గెలిచిన బహుమానాన్ని చూడాలని కోరగా.. కుంతి పరధ్యానం లో ఉండి తల తిప్పకుండానే ఐదుగురిని పంచుకోమని చెబుతుంది. దీనితో.. తల్లి మాట ప్రకారం పాండవులు ఐదుగురు ద్రౌపది ని పెళ్లాడుతారు. ఆ తరువాత కుంతి బాధపడుతుంది. జరిగింది జరిగిపోయినా.. ద్రౌపది మాత్రం తన భర్తలతో సఖ్యత గా మెలిగేది.

వారి మధ్య గొడవలు రాకుండా ఉండేది. ఇందుకోసం పాండవులు కూడా ఓ నియమం పెట్టుకున్నారు. ద్రౌపది కొన్ని నెలలపాటు ఒక్కొక్కరి దగ్గరా ఉంటూ వచ్చేది. ఆ సమయం లో మరొకరు ద్రౌపది ఉన్న చోటుకు వెళ్లకూడదని.. అలా వెళితే నియమం తప్పినందుకు అరణ్యవాసం చేయాల్సి ఉంటుందని నియమం పెట్టుకున్నారు. ఓసారి.. ఓ వ్యక్తి అర్జునుడు వద్దకు వచ్చి కొందరు తన పశువుల్ని దొంగిలించారని తనని రక్షించాలని కోరతాడు. అయితే.. అర్జునుని విల్లు ధర్మరాజు వద్ద ఉంటుంది. ఆ సమయం లో ద్రౌపది ధర్మ రాజు వద్ద ఉంటోంది.

నియమం తప్పుతుందని తెలిసినా.. అర్జునుడు ధర్మరాజు వద్దకు వెళ్లి విల్లు తీసుకుని సమస్యను పరిష్కరించి ఆ తరువాత అరణ్యవాసం చేస్తాడు. అందుకే.. ద్రౌపది కి ఐదుగురు భర్తలున్నా ఏనాడు వారి మధ్య గొడవలు రాలేదు. ద్రౌపది గురించి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఆమె అందరిలా పసిపిల్లలా తల్లి కడుపున పుట్టలేదు. యుక్తవయసు ఉన్న స్త్రీ గా అగ్ని నుంచి పుట్టింది. అందుకే ఆమెని యజ్ఞసేని అని పిలుస్తారట.

ఆమె శ్రీకృష్ణుడిని తప్ప.. తన భర్తలతో సహా ఎవరిని అంతగా నమ్మేది కాదట. ఎందుకంటే.. శ్రీ కృష్ణుడు ఆమెను వస్త్రాపహరణం నుంచి చీరలు ఇచ్చి రక్షిస్తాడు. అప్పటినుంచి ఆమె శ్రీకృష్ణుడిని సోదరుడిగా భావించి ఆరాధిస్తుంది. విరాట రాజు కొలువులో కీచకుల వలన, నిండుసభలో కౌరవులు కూడా ఆమెను అపహాస్యం చేయడం తో ఆమెకు తమ భర్తలపై నమ్మకం పోయిందట.

కానీ.. ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్ళేటపుడు ఆమె కన్య గానే వెళ్ళేది. అదెలా అంటే.. ఆమెకో వరం ఉంది. ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్లే సమయం లో ఆమె అగ్ని లోంచి నడిచేది. ఆ తరువాత తిరిగి కన్య గా అయ్యాక.. మరో భర్త వద్దకు వెళ్ళేది. ద్రౌపది తన ఇంట్లో సామాన్లను ఎప్పుడు నిండుగా ఉంచుకునేదట. ఎవరు వచ్చినా వండిపెట్టి కడుపునిండా భోజనం పెట్టేది.

ద్రౌపది కుక్కలకు కూడా శాపం ఇచ్చిందని చెబుతుంటారు. ఓ రోజు ధర్మరాజు తన చెప్పులను గది బయట విడిస్తే, కుక్క నోట కరుచుకుని పోతుంది. అది చూసి కోపించిన ద్రౌపది కుక్కలు బహిరంగంగానే , అందరు చూస్తూ ఉండగా శృంగారం చేయాల్సి వస్తుందని శపిస్తుంది.


Published by
Lakshmi Bharathi

Recent Posts

  • Off Beat

1p/sec తో టెలికాం రంగంలో రెవల్యూషన్ తీసుకొచ్చిన “టాటా డొకోమో”…ఎందుకు సడన్ గా క్లోజ్ అయ్యింది.?

కొన్ని సంవత్సరాల క్రితం ఒక ట్రెండ్ సృష్టించిన టెలికాం కంపెనీ టాటా డొకోమో. దీన్ని భారతదేశంలో ఎక్కువ శాతం మంది… Read More

1 hour ago
  • Bigg Boss 5 telugu

Bigg Boss Telugu-5 : షన్నుకి సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్.!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇవాల్టి ఎపిసోడ్ ప్రోమో విడుదల అయ్యింది. ఇవాళ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ తన… Read More

1 hour ago
  • Filmy Adda

“జెర్సీ” సినిమాలో ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారో..? ఎప్పుడైనా గమనించారా?

డైరెక్టర్ పని అంత సులభమైనది కాదు. ఒక సినిమా మాత్రమే కాదు ఆ సినిమా లో నటించిన వాళ్ళు, ఇంకా… Read More

4 hours ago
  • Filmy Adda

మీడియా కి నాగ చైతన్య వార్నింగ్ ఇలా వింటేనే మీతో ఇంటర్వ్యూ లు అంటూ షరతు ..!

అక్కినేని వారసుడు నాగ చైతన్య, సమంతల పైన వ్యక్తిగత జీవితం పైన గతి కొన్ని రోజులుగా మీడియా లో వస్తున్న… Read More

4 hours ago
  • Bigg Boss 5 telugu

బిగ్‌బాస్ ప్రియ కూతురి కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు..! చనిపోయే రెండు రోజుల ముందే..?

ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరు శైలజ… Read More

5 hours ago
  • Filmy Adda

దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘హనుమాన్’ ఫస్ట్ లుక్ వచ్చేది ఎప్పుడంటే !

వెరైటీ కాన్సెప్ట్స్ తో టాలీవుడ్ లో తనదైన ముద్ర ని వేసుకున్న దర్శకుడు 'ప్రశాంత్ వర్మ'. ఆ, కల్కి, జాంబీ… Read More

5 hours ago
Ads