Ads
హఠాత్తుగా ట్విటర్ లో G.O.A.T. అనే ఈ ఇమోజీ ఫ్యాన్ వార్ ట్రెండ్ అయింది. కానీ దీనిని మొదటి చూసిన వారికి అయితే పిచ్చెక్కి పోతోంది. ఇంత సెలెబ్రెటీలను పట్టుకుని మేక అంటున్నారు ఏంటి అని ఆలోచనలో పడ్డారు. మరి కొంత మంది అయితే అసలు G.O.A.T. అంటే ఏమిటి అని ఆలోచిస్తున్నారు.
Video Advertisement
పైగా ఇది ఎందుకు ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది అనేది కూడా అర్థం కాక బుర్ర పీక్కుంటుంటున్నారు. మీకూ కూడా ఆ సందేహం వుందా..? అయితే మరి ఇప్పుడే దాని కోసం చూద్దాం.
ఎక్కడ చూసినా ఇదే వినబడుతోంది. G.O.A.T. G.O.A.T. అని. ఇంత పెద్ద సెలబ్రిటీలను పట్టుకుని అంత మాట అంటున్నారు ఏంటి అని అందరూ కాస్త కన్ఫ్యూజన్ లో పడ్డారు. అయితే అసలు ఈ పదాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అనేది చూస్తే.. G.O.A.T. అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అని అర్థం. ఒకరిని పొగడడానికి, వారి యొక్క టాలెంట్ ని తెలపడానికి వాడుతారు.
ముఖ్యంగా పాలిటిక్స్, క్రికెట్, సినిమా ఫీల్డ్స్ లో ఉన్న వారి యొక్క టాలెంట్ ని పొగడడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు. సోషల్ మీడియా వాడకం ఎక్కువయ్యాక ఈ పదం బాగా పాపులర్ అయిపోయింది. మొట్టమొదటిసారి ఈ పదాన్ని బాక్సింగ్ లెజెండ్ మొహమద్ అలీ భార్య లోన్ని అలీ 1992లో వాడారు.
అలా తర్వాత చాలా మంది ఈ పదాన్ని ఉపయోగిస్తూ వచ్చారు. ఆయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ పదానికి అర్థం జంతువు కాదు. వారి యొక్క గొప్పతనం మరియు టాలెంట్ ని తెలపడం కోసమే ఈ హ్యాష్ ట్యాగ్లు లు వచ్చాయి. ఇవి ఇప్పుడు ట్విట్టర్ లో తెగ వైరల్ అయిపోతున్నాయి.
End of Article