నిజాం కాలంలో లాక్ డౌన్, క్వారెంటైన్ ఎలా ఉండేదో తెలుసా? అప్పుడు ఎందుకు పెట్టారంటే?

నిజాం కాలంలో లాక్ డౌన్, క్వారెంటైన్ ఎలా ఉండేదో తెలుసా? అప్పుడు ఎందుకు పెట్టారంటే?

by Anudeep

Ads

కరోనా కేసులు ఇప్పటికి ఆగట్లేదు. పూర్తిగా లాక్ డౌన్ కూడా ఎత్తేసారు. మనం జాగ్రత్తగా ఉండటమే మనల్ని కాపాడుతుంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మార్చ్ లో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే గతంలో వందేళ్ల క్రితం భయంకరమైన ప్లూ, కలరా లాంటి వ్యాధులు ప్రభలినప్పుడు కూడా లాక్ డౌన్ పాటించారు..ఆ వివరాలు ఏంటో చూడండి.

Video Advertisement

ప్రతి వందేళ్లకి ఒకసారి భయంకరమైన వైరస్లు ప్రపంచాన్ని వణికించాయని చదువుకున్నాం కదా.. ఆ వైరస్ల థాటికి వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు..సరిగ్గా వందేళ్లక్రితం అనగా 1919లో కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్లూ ప్రభలింది. ఫ్లూతో కొన్నివందల మంది మంచం పట్టారు.

కరోనా మాదిరిగానే అది కూడా అంటు వ్యాధి కావడంతో ఎక్కువ మంది జనాలు గుంపులు గుంపులుగా ఉండకుండా చూడాలని పాలకులు నిర్ణయించారు. ఆ నిర్ణయంలో భాగంగా  ప్రజల రక్షణ కోసం రెండో నిజాం ఆలీఖాన్ నగరం చుట్టు పన్నెండు దర్వాజాలతో ప్రహారి కట్టించారు.

ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే రాకపోకలు జరిగేలా  దర్వాజాలు తెరిచి ఉంచేవారు.మిగతా సమయాల్లో  ఎటువంటి రాకపోకలు జరగకుండా దర్వాజాలు మూసివేసేవారు. ఇలా నగరంలో  అంటు వ్యాధులు ప్రబలకుండా నగర దర్వాజాలు మూసి వేసేవారు.అంతేకాదు నగర ప్రజలను వేరే ప్రాంతాలకు వెళ్లనిచ్చే వారు కాదు, వేరే ప్రాంతాల వారిని నగరంలోకి రానిచ్చేవారు కాదు . అప్పటి ఈ లాక్  డౌన్ ఫలితంగా రోగాలు తగ్గుముఖం పట్టేవి.

అంతేకాదు క్వారంటైన్ అనేది వందేళ్ల క్రితందే.. 1915లో నగరానికి దూరంగా ఈరన్న గుట్ట దగ్గర చిన్న హాస్పిటల్ ని కట్టించారు . అంటువ్యాధులు సోకిన వారిని ఇతరులకు అంటకుండా ఊరికి దూరంగా ఉన్న ఆ హాస్పిటల్ లో క్వారంటైన్లో ఉంచేవారు. వందేళ్ల క్రితం ఏర్పడిన ఆ హాస్పిటలే క్వారంటైన్ హాస్పిటల్.. ప్రస్తుతం మన వాడుకలో కోరంటి హాస్పిటల్ గా పేరుగాంచింది. అలా దేశంలో మొదటి క్వారంటైన్ హాస్పిటల్ వందేళ్ల క్రితమే ప్రారంభమయింది. ఈ లాక్ డౌన్ ఇవన్ని అప్పుడు కూడా ప్రజలు పాటించారు.


End of Article

You may also like