Ads
మనం ఏదైనా బస్సు లేదా ట్రైన్ ఎక్కినప్పుడు బయట పరిసరాలను గమనిస్తే మనం ఎక్కడ ఉన్నామో, తరువాత ఏ స్టేషన్ కు చేరబోతున్నామో తెలుస్తుంది. కానీ, డ్రైవింగ్ లో ఉండే లోకో పైలట్లకు ఈ విషయం ఎలా తెలుస్తుంది.? మీకెప్పుడైనా ఈ సందేహం వచ్చిందా..? అయితే ఈ ఆర్టికల్ ను చదివి తెలుసుకోండి.
Video Advertisement
లోకో పైలట్లకు వారు ఏ స్టేషన్ కు చేరుకోబోతున్నారో ముందే తెలుసుకునే అవకాశం ఉంటుంది. లోకోపైలట్లు డ్యూటీ లోకి దిగేముందు వారు ప్రయాణించే మార్గానికి సంబంధించి అన్ని వివరాలను తెలుసుకుంటారు. వారికి ఇచ్చే సమాచారం లో అన్ని వివరాలు ఉంటాయి. కిలోమీటర్లు, వేగం, దాని పరిమితులు, వంతెనలు, సొరంగాలు సంబంధించి పూర్తి సమాచారం వారికి ఇవ్వబడుతుంది. వంతెనలు, సొరంగాలు వచ్చినపుడు కూడా ఉండే వేగ పరిమితికి సంబంధించి వారికి ఖచ్చితమైన సమాచారం ఇవ్వబడుతుంది.
ఉదాహరణకు 125/3 నుంచి 130/5 వేగం గురించి సమాచారం ఇచ్చారంటే.. 125 – 135 అనేవి తరువాత రాబోయే ప్రధాన ద్వారాన్ని సూచిస్తాయి. 3 & 5 అనేవి పోల్ నెంబర్ ను సూచిస్తాయి. ప్రతి కిలోమీటర్ కు ఇలాంటి పోల్స్ 18 నుంచి 20 వరకు ఏర్పాటు చేయబడతాయి. ఈ పోల్ నంబర్స్ సాయం తో కూడా లోకో పైలట్లు తాము గమ్యస్థలానికి చేరబోతున్నట్లు తెలుసుకుంటారు.
అలాగే, అప్రోచ్ సిగ్నల్ ద్వారా కూడా లోకో పైలట్లు స్టేషన్ రాబోతోందని గ్రహిస్తారు. ప్రతి స్టేషన్‌లో అప్రోచ్ సిగ్నల్ ఉంటుంది. ఇది స్టేషన్ సమీపం లో ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలను ఇవ్వగలుగుతుంది. అంతే కాదు, రైలు మార్గం లో ఎక్కడా వంకర్లు లేకపోతె.. ఈ సిగ్నల్స్ ను చాలా దూరం నుంచే మనం గమనించవచ్చు.
End of Article