లాక్ డౌన్ వలన కలిగిన ఇబ్బందులు ఓసారి పక్కన పెట్టి…మనకు జరిగిన మంచి ఏంటో చూడండి!

లాక్ డౌన్ వలన కలిగిన ఇబ్బందులు ఓసారి పక్కన పెట్టి…మనకు జరిగిన మంచి ఏంటో చూడండి!

by Anudeep

Ads

“మరక మంచిదే” అని అదేదో యాడ్లో చెప్పినట్టు..కరోనా కూడా ఒకందుకు మంచిదే అనిపిస్తోంది. అడ్డగోలుగా మారిపోయిన జీవన శైలిని ఒక ఆర్డర్లోకి తీసుకురావడానికి ఈ కరోనా భయం కలిసొచ్చింది. దీని మూలంగా అసాధ్యం అనుకున్న అసాధరణ విషయాలను కూడా చాలా సాధారణంగా తీసుకునేలా అందరి జీవితాలను ప్రభావితం చేసింది. మీకు తెలియకుండానే మీ జీవితంలో మీ కుటుంబంలో, మీ చుట్టు ఉన్న సమాజంలో ఈ లాక్ డౌన్ కాలంలో చోటు చేసుకున్నఆసక్తికరమైన మార్పులు ఏంటో ఓ లుక్కేయండి.

Video Advertisement

lockdown Hyderabad images

lockdown Hyderabad images

చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మందు తాగకుండా బతకలేం అని భ్రమల్లో ఉన్నవారిని కూడా కిక్కుమాట దేవుడెరుగు కిమ్మనకుండా మంచి నీళ్లు తాగుతూ బతికేలా చేసింది. దీనికోసం అయినా మనం కరోనాకి థాంక్యూ చెప్పుకోవాలి..సంపూర్ణ మద్యనిషేదం ఇలా అయినా సాధ్యపడింది.

అలాగే కుటుంబ వ్యవస్థల్లోను అనేక సానుకూల మార్పులకు శ్రీకారం చుట్టింది ఈ లాక్ డౌన్ కాలం.. భార్య భర్త ఇద్దరూ ఉద్యోగాలు,  ఉదయం లేవగానే ఉరుకుల పరుగుల జీవితం, పిల్లల జీవితాలు రోజులో ఎక్కువభాగం స్కూలు, ట్యూషన్లకే అంకితం..దాంతో కుటుంబం అంతా ఒక దగ్గర గడిపే వెసలుబాటు కల్పించింది ఈ లాక్డౌన్ కాలమే.

ఉదయం బ్రేక్ పాస్ట్ తో మొదలు పెడితే మద్యాహ్నం లంచ్,ఈవెనింగ్ స్నాక్స్   నైట్ డిన్నర్  వరకు ఇలా ప్రతిదానికి హోటల్స్, కర్రీ పాయింట్స్ పై ఆధారపడిన మనం గత పదిహేను రోజులుగా బుద్దిగా ఇంట్లో వండుకుని తింటున్నాం..దీన్ని బట్టి ఏం అర్దమైంది..వంట చేయడం కష్టం కాదు, బయట ఫూడ్ తినకుండా కూడా మనం ఉండగలం.అంతేకాదు ఈ పదిహేను రోజులుగా ఫూడ్ వేస్టేజ్ కూడా చాలా తగ్గింది.

ఒక్కసారిగా అందరికి వ్యక్తిగత శుభ్రత , ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగిపోయింది. దాంతో ప్రతి ఒక్కరు శుభ్రత పాటించడంతో పాటు తమ చుట్టు ఉన్నవారిని కూడా పాటించమని చెప్తున్నారు..పాటించే వరకు చెప్తున్నారు..శుభ్రత విషయంలో ఇంతకుముందు ఒక్కోసారి చూసి చూడనట్టు వదిలేసేవాళ్లం కాని ఇప్పుడు ప్రతి క్షణం ఎంతో అలర్ట్ గా ఉండేలా చేసింది కరోనానే..అతి చిన్న వైరసే..

ఈ పదిహేను రోజుల్లో క్రైం రేట్ పూర్తిగా పడిపోయింది..పేపర్ తెరిస్తే కచ్చితంగా రేప్ కేస్, యాక్సిడెంట్స్, దొంగతనాలు ఇలా ఏవో ఒక ఇష్యూస్ ఉండేవి .గత పదిహేను రోజులుగా వీటితో పాటు అల్లర్లు, మత పరమైన గొడవలు అన్ని కూడా చాలా వరకు తగ్గాయి..

కేవలం ఓట్ల కోసం, రాజకీయాల్లో వారి స్థానాల కోసమే ఆరాటపడే రాజకీయ నాయకలు మొదటి సారి ప్రజల కోసం పనిచేయడం చూస్తున్నాం.. నిజంగా మనిషిని మనిషిగా నిలబెట్టింది ఈ కరోనా. మనిషికి అవసరం అయింది డబ్బు, వస్తువులు కాదు ఆహారం అని తెలియచేసింది.. మనకి కావల్సింది రైతులు, డాక్టర్లు అని ప్రూవ్ చేసింది.

 

ఇప్పటివరకు మనిషి చెట్లను నరికేసి తన అవసరాలను తీర్చుకున్నాడు. జంతువులను జూలో బంధించాడు.. దీంతో ఒక్కసారిగా మనిషి తన ఇంట్లో తను బంధి అయ్యాడు . మిగిలిన జంతువులన్ని విశాలంగా రోడ్లపైకి వస్తు ప్రకృతిని ఆస్వాదిస్తున్నాయి. కాలుష్యం చాలా వరకు తగ్గిపోయింది.

మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉందని ప్రూవ్ చేస్తున్నారు కొందరు . పూట గడవని వారికి  ఆహారాన్ని అందిస్తూ, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణి చేస్తూ మానవసేవే మాధవ సేవ అని చాటుతున్నారు. చివరికి స్ట్రీట్ యానిమల్స్ ని ట్రీట్ చేసే విధానం కూడా మారింది..వాటి గురించి కూడా ఆలోచిస్తూ వాటికి ఫూడ్ సర్వ్ చేస్తున్నారు కొందరు.

 

ఇవన్ని మనకి ఉపయోగపడిన విషయాలే కదా.. మన జీవనశైలిని గాడిలో పెట్టిన విషయాలే కదా.. ఈ లాక్ డౌన్  వలన జరిగిన మరిన్ని మంచి పనులేవైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి.

 


End of Article

You may also like