Ads
జాతక దోషాలకు పరిహారం అవ్వాలన్నా, గ్రహాలు అనుకూలించాలన్నా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే మంచిది అని చెబుతుంటారు. అష్టకష్టాలు పడుతూ.. ఇబ్బందుల్లో ఉన్న వారు నవగ్రహాలను వేడుకుంటే.. వారు కరుణించి జీవితం సవ్యం గా నడిచే విధం గా చేస్తారు. నవగ్రహ ప్రదక్షిణాలు చేసే ముందు శుచిగా స్నానం చేసి.. శుభ్రం గా ఉండాలి. కొంతమంది నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణాలు చేస్తారు. ఇలా చేయకూడదు.. దూరం గా ఉంటూనే ప్రదక్షిణ చేయాలి.
Video Advertisement

నవగ్రహ మంటపం లోకి సూర్యుని చూస్తూ లోపలకి వెళ్ళాలి. చంద్రునికి కుడివైపు నుంచి తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత కుడి నుంచి ఎడమవైపుకు అంటే బుధుడి వైపుకు రాహు, కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయండి. ఇలా మొత్తం 11 చేయాలి. అలాగే.. నవగ్రహ స్తోత్రం పఠించాలి. నవగ్రహాలకు వీపు చూపకుండా ప్రదక్షిణ చేయాలి. శివాలయాల్లో నవగ్రహాలు ప్రత్యేకం గా ఉంటాయి. దేవాలయాల్లో ముందు మూల విరాట్టుని దర్శించాక.. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి.

అలాగే మరికొంతమంది అయితే.. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం మంచిది కాదని భావిస్తూ ఉంటారు. ముందు మూల విరాట్టు ను దర్శించుకున్నాక.. గుడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా చేయడం కూడా సరికాదు. ప్రధాన ఆలయ దర్శనం అయ్యాక నవగ్రహాలను కూడా దర్శించుకోవాలి.
End of Article
