Ads
ఇదివరకు ఎవరికైనా డబ్బులు పంపించాలంటే బ్యాంకుకు వెళ్లి.. లైన్‌లో నిల్చుని.. డిపాజిట్ అప్లికేషన్ పూర్తిచేసి.. డబ్బులు జమ చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నెంబర్ ఉంటే చాలు.. కొన్ని డిజిటల్ యాప్‌లు ఉపయోగించి.. క్షణాల్లో డబ్బులు బదిలీ చేయవచ్చు. అంతేకాదు.. యాప్ యొక్క యూపీఐ ఐడి తెలిసినా చాలు.. ఏ యాప్ నుంచి వేరు యాప్ కైనా.. నగదు బదిలీ చేయవచ్చు. ఎలా చేసినా.. ఈడబ్బులు ఖాతాదారుడి అకౌంట్‌లో జమ అవుతాయి.
Video Advertisement
అయితే ఇటీవల కాలంలో రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే ఒక అకౌంట్‌కు బదులు మరో అకౌంట్‌కు పొరపాటున డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగిస్తున్నవారు ఎప్పుడో ఒకప్పుడు పొరపాటుగా ఇలాంటి పేమెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి పొందేందుకు ఏమి చేయాలో తెలుసుకుందాం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం, డిజిటల్ సేవల ద్వారా అనుకోకుండా, పొరపాటుగా ఏవైనా లావాదేవీలు జరిపితే, బాధిత వ్యక్తి మొదట ఏ యాప్ ఉపయోగించి ట్రాన్సాక్షన్ చేస్తారో, వారికి ఫిర్యాదు చేయాలి. ఉదాహరణకు గూగుల్ పే ద్వారా ఒకరికి డబ్బులు పంపబోయి పొరపాటున మరొకరికి మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే మొదట గూగుల్ పేకు ఫిర్యాదు చేయాలి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పోర్టల్‌లో కూడా కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది.చెల్లింపు వ్యవస్థ సమస్యను పరిష్కరించడంలో విఫలమైతే, డిజిటల్ లావాదేవీల కోసం ఆర్బీఐ ఏర్పాటు చేసిన అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు.
కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించే డిజిటల్ లావాదేవీల కోసం ఆర్బీఐ సీనియర్ అధికారిని అంబుడ్స్‌మెన్‌గా నియమించింది. ఆర్బీఐ ప్రకారం.. ఒక సాధారణ కాగితంపై రాసి పోస్ట్/ఫ్యాక్స్/హ్యాండ్ డెలివరీ ద్వారా అంబుడ్స్‌మన్ సంబంధిత కార్యాలయానికి పంపడం ద్వారా అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు చేయవచ్చు. మీరు డిజిటల్ లావాదేవీల కోసం అంబుడ్స్‌మన్‌కి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదును కూడా పంపవచ్చు. మీరు ఫిర్యాదు చేసిన సర్వీస్ ప్రొవైడర్ బ్రాంచ్ లేదా ఆఫీస్‌కు ఫిర్యాదును పంపాలి. ఆర్బీఐ వెబ్‌సైట్‌లో స్కీమ్‌తో పాటు ఫిర్యాదు ఫారమ్ కూడా ఉంటుంది.
End of Article