ఊపిరితిత్తుల్లో చేరిన కఫాన్ని ఇలా అంతం చెయ్యండి.!

ఊపిరితిత్తుల్లో చేరిన కఫాన్ని ఇలా అంతం చెయ్యండి.!

by Anudeep

Ads

ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరిలోనూ రోగ నిరోధక శక్తి అధికంగా ఉండవలసిన అవసరం ఉంది. అలాగే రాబోయేది చలి కాలం. ఇక ఇప్పుడు పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు అందరికి దగ్గు,జలుబు, గొంతు నొప్పి వంటివి చాలా తొందరగా వచ్చేస్తాయి. వీటిని అశ్రద్ద చేస్తే ఊపిరితిత్తులలో కఫము పెరుకు పోతుంది. ఇది అనేక రకాల సమస్యలకు దారి తీస్తుంది. అది శరీరం లోనుంచి బయటకు వచ్చే వరకు ఇబ్బందే.

Video Advertisement

దీని కోసం డాక్టర్ ను కలిసి వైద్యం తీసుకోవడం తో పాటు .. మంచి ఇంటి చిట్కా ఉంది. మన ఇంటిలో సులభంగా ఉండే వస్తువులతో సులభంగా చేసుకోవచ్చు. ఈ చిట్కా కోసం తమలపాకు,అల్లం,తేనె ఉపయోగిస్తున్నాం. ఒక తమలపాకును శుభ్రంగా కడిగి రసం తీయాలి. అల్లంను కూడా తురిమి రసం తీయాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ తమలపాకు రసం,ఒక స్పూన్ తేనె వేసి కలపాలి.

how to get rid of cough..
ఈ మిశ్రమాన్ని ఉదయం ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్ తీసుకోవాలి. చిన్న పిల్లలకు అయితే అరస్పూన్ సరిపోతుంది. మూడు రోజుల పాటు తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.

how to get rid of cough.. తమలపాకులో ఉన్న లక్షణాలు శ్వాసకోశ సమస్యలను, దగ్గు, ఆస్తమా,గొంతులో కఫాన్ని తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వీటి తో పాటు ఈ చలి కాలం అంతా గోరు వెచ్చని నీటిని తాగుతూ ఉండటం వల్ల కఫం పోవడం తో పాటు.. శరీరం లోని మలినాలు కూడా తొలగిపోతాయి.

how to get rid of cough..
అల్లం,తేనెలో ఉండే లక్షణాలు కూడా దగ్గు,గొంతునొప్పి, ఇన్ ఫెక్షన్, ఊపిరితిత్తులలో కాపాన్ని తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. డయబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఈ చిట్కా ఫాలో అవ్వవచ్చు. సమస్య కాస్త ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఆ సూచనలను పాటిస్తూ ఈ చిట్కా ఫాలో అయితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.


End of Article

You may also like