మీరు వాడే ఆవాలు కల్తీ అయ్యాయా.. లేక మంచివా..అనేది ఎలా తెలుస్తుంది..?

మీరు వాడే ఆవాలు కల్తీ అయ్యాయా.. లేక మంచివా..అనేది ఎలా తెలుస్తుంది..?

by Anudeep

Ads

భారతీయ వంటల్లో ముఖ్యంగా దక్షిణ భారత వంటల్లో ఆవాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఏ వంటకి అయినా పోపులో ఆవాలు లేనిదే రుచి రాదు. మరి ఆవాలు కూడా కల్తీ అవుతాయా..? అని డౌట్ వచ్చిందా..? నిజమే. ఆవాలు కూడా కల్తీ అయ్యే అవకాశం ఉంది.

Video Advertisement

క్వాలిటీ విత్తనాలు కాకుండా కల్తీ అయిన విత్తనాలు వాడి పండించే పంట కల్తీనే అవుతుంది. వాడే విత్తనాలు విషపూరితమైనవి అయితే ఆ ఆవాలు కల్తీవే అవుతాయి. అలాంటి వాటిని ఆహారంలో తీసుకోవడం వలన ఎక్కడలేని అనారోగ్య సమస్యలని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.

mustard 1

మరి దీనిని ముందే ఎలా గుర్తించాలి..? అనారోగ్యం బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలి అన్న సంగతి ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య విత్తనాలు కూడా అర్జిమోన్ విత్తనాలతో కల్తీ అవుతున్నాయి. వీటిని గుర్తించడం కోసమే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్విట్టర్ మాధ్యమంగా ఓ వేదికను ప్రారంభించింది. ప్రతి వారం ఈ అంశం పై ప్రజలకు అవగాహనా కల్పించే విధంగా పోస్ట్ లు చేస్తున్నారు.

mustard 2

అర్జెమోన్ విత్తనాలు ఆవాల గింజలలాగా ఉంటాయి. దీని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసా..? ఈ గింజలలో 30-35% నూనె ఉంటుంది. డీహైడ్రోసాంగ్వినారైన్, బెంజోఫెనాంత్రిడిన్ ఆల్కలాయిడ్స్ సాంగునారిన్ వంటి టాక్సిక్స్ ఉంటాయి. ఈ గింజలు లేదా నూనెని తీసుకోవడం వలన ఎడెమా వచ్చే అవకాశం ఉంటుంది. ఎర్ర రక్తకణాలు చనిపోతాయి. ఫలితంగా ఒత్తిడి పెరగడం, రక్త హీనత, చివరికి రక్త ప్రసరణ కూడా ఆగిపోయి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది.

mustard 3

వీటిని గుర్తించడం తేలికే. ఒక ప్లేట్ లో ఆవాలను తీసుకుని వాటిని గమనించండి. వాటిల్లో ఆవాలు ఉపరితలంలో మృదువుగా ఉంటాయి. అలా కాకుండా గరుకుగా ఉండి, పూర్తి నలుపు రంగులో కనిపిస్తే మాత్రం అనుమానించాలి. కాబట్టి మీరు ఏవైనా వాడేటప్పుడు గమనించండి. FSSAI ద్వారా ధృవీకరించబడిన ఆహారపదార్ధాలను మాత్రమే ఉపయోగించండి.


End of Article

You may also like