Ads
మీ మణికట్టుని ఒకసారి లాగి దగ్గరకి చేసి పట్టుకోండి. మళ్ళీ వదిలెయ్యండి. ఆ… ఇప్పుడు మీ చర్మ ఎప్పటి లాగానే యదాస్థితికి చాలా తొందరగా చేరుకుందా? లేక ఆలస్యంగా చెరుకుందా?? అయితే జీవితంలో సగటు మనిషి వయసుతో సంబంధం లేకుండా నీరసానికి గురవుతున్నారు అంటే దానికి కారణాలు ఎన్ని ఉన్నా ప్రధాన కారణం ఒంట్లో నీటి శాతం ఎక్కువ లేదని అర్థం.
Video Advertisement
అందుకే పెద్దలు కానీ, డాక్టర్లు కానీ ఎక్కువగా నీరు తాగాలి అని చెబుతుంటారు. అయినా సరే కొంత మందికి వృత్తిరీత్యా నీరు దొరక్కపోవడం, లేదా ప్రత్యేకంగా ప్రతీ సారి నీళ్ళ బాటిల్ పట్టుకొని వెళ్ళాలంటే బద్దకం, కేవలం దాహం వేసినప్పుడు, నోరు ఎండిపోయినప్పుడు మాత్రమే నీళ్ళు తాగడం వంటివి చేస్తారు.
కొన్ని సార్లు ఆ పూటకి చల్లని ఐస్ లాగా ఉన్న నీళ్ళని తాగుతారు. ఇక ఈ మధ్య కొన్ని నివేదికల ప్రకారం చూసినట్టు అయితే యువత ఎక్కువగా అనేక రకాల రోగాల భారిన పడుతున్నారు. దానికి ముఖ్య నీళ్ళు ఎక్కువ తాగక పోవడం అని చెప్పక తప్పదు. అసలు నీళ్ళు తాగకపోతే ఏమవుతుంది అనుకుంటారు కానీ, ఎన్ని చిట్కాలు పాటించినా నీరు తాగకపోతే చర్మం, కళ్ళు పొడిబారటం, ముడతలు పడటం, త్వరగా నీరసానికి గురవడం, చిరాకు రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, మూత్రం తక్కువగా రావడం వంటివి జరుగుతాయి.
అలాంటప్పుడు ఎన్ని కాస్మోటిక్స్ వాడినా, మందులు వాడినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి నీళ్ళు ఎక్కువగా తాగడం చలా మంచి. అయితే శరీరం లో నీటి సంఖ్య తక్కువ ఉందో సరైనా మోతాదులో ఉందో తెలుసుకోవాలి అంటే మణికట్టుపై చర్మాన్ని లాగి పట్టుకుని వడిలేసాక తొందరగా చర్మం యదాస్థితికి చేరుకుంటే శరీరంలో నీటి శాతం సరిగ్గా ఉన్నట్టు. అదే ఆలస్యంగా జరిగితే నీటి శాతం తక్కువగా ఉన్నట్టు.
కాబట్టి మనిషికి తమ బాడీ వెయిట్ ని బట్టి నీరు తీసుకోవాలి అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. 20 కిలోల బరువు ఉంటే 1 లీటరు నీళ్ళు తాగాలి ఒకవేళ బరువు రెట్టింపు అయితే దాని బట్టి శరీర నీటి మోతాదు పెంచాలి. ఒకవేళ 60 కిలోల బరువు ఉంటే, 20 కిలోల బరువుకు 1 లీటరు నీళ్ళు తగలన్న ప్రక్రియ ప్రకారం, 3 లీటర్లు తాగాలి. అలా బరువును బట్టి సరైన మోతాదు నీటిని శరీరానికి అందించాలి.
ఇదే విషయాన్ని యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ప్రకారం… సగటు మహిళకు కనీసం రోజుకి 2.7 లీటర్లు, పురుషుడు అయితే 3.7 లీటర్ల నీరు తాగాలని పరిశోధన ద్వారా వెల్లడించింది. మొత్తంగా నీరు వొంటకి చాలా మంచిది అన్నమాట. చివరిగా ఒక మాట ఎంటంటే పడుకునే ముందు కూడా ఒక గ్లాసు నీరు తాగితే ద్రవనష్ట అంటే నీటి శాతాన్ని కోల్పోయే పరిస్థితిని నివారించడంతో పాటు గుండెపోటు కూడా తగ్గుతుందట.
ALSO READ : వాట్సాప్ లో అమ్మాయికి ఈ మెసేజ్ పంపితే డైరెక్ట్ జైలుకే..! అసలు విషయం ఏంటంటే..?
End of Article