Ads
భారతీయ స్టాక్ మార్కెట్లో మీరు ఎలా పెట్టుబడులు పెట్టవచ్చో తెలుసుకోవడానికి ముందు భారత స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడం అవసరం. ఇండియా లో రెండు టాప్ స్టాక్ ఎక్స్ఛేంజీలు ఉన్నాయి. వాటిలో ఒకటి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) మరొకటి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ). బిఎస్ఇ 1875 లో స్థాపించబడిన పురాతన స్టాక్ ఎక్స్ఛేంజ్ కాగా, ఎన్ఎస్ఇ 1992 లో స్థాపించబడింది. ఎన్ఎస్ఇ భారతదేశంలో అతిపెద్ద స్టాక్. దీనిలో బిఎస్ఇ కంటే తక్కువ సంఖ్యలో జాబితాలు ఉన్నప్పటికీ ఎక్కువ లిక్విడిటీని అందిస్తున్న కారణంగా ఇది అతిపెద్ద స్టాక్ గా కొనసాగుతోంది. భారతదేశంలోని అన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నియంత్రిస్తుంది.
Video Advertisement
ఇండియా-ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్) మరియు ఇండియన్ స్టాక్ లేదా అమెరికన్ లేదా గ్లోబల్ డిపాజిటరీ రసీదులు (ఎడిఆర్ లు లేదా జిడిఆర్) ఆధారంగా ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ నోట్స్ (ఇటిఎన్) లలో సాధారణం గా అమెరికా పౌరులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అమెరికా లో ఉండి ఇండియా లో స్టాక్ మార్కెట్ లో బిజినెస్ చేయాలంటే.. యు.ఎస్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఇసి) చే నియంత్రించబడే అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థతో ఖాతా తెరవాల్సి ఉంటుంది. లేదంటే, సెబీ-రిజిస్టర్డ్ ఇండియన్ స్టాక్ బ్రోకర్‌తో అయినా ఖాతా తెరవాల్సి ఉంటుంది.
మోతీలాల్ ఓస్వాల్ వంటి ఏ ప్రసిద్ధమైన బ్రోకరేజ్ సంస్థతో అయినా మీరు అకౌంట్ ను ఓపెన్ చేసుకోవచ్చు. ఎన్ఎస్ఇలో ఇన్వొల్వె అయి ఉన్న ఇంటరాక్టివ్ బ్రోకర్ల వంటి అంతర్జాతీయ బ్రోకర్లు భారతీయ మార్కెట్ లలో వ్యాపారం చేయడానికి అనుమతిస్తాయి. భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి నేరుగా స్టాక్ కొనుగోలు మరియు అమ్మకం చేయడానికి మీరు ఈ ఖాతాలను తెరవచ్చు. అమెరికా లో ఉండే ఇండియన్స్, ఇండియా లో ఉండే ఇండయన్స్ కూడా ఈ ఖాతాలు తెరవచ్చు. భారతీయ పెట్టుబడిదారులు తమ స్థానం ఆధారంగా ఎన్‌ఎస్‌ఇ స్టాక్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చు.
ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ లేదా చార్లెస్ ష్వాబ్ వంటి ఇతర బ్రోకరేజ్ సంస్థలు వాణిజ్య సేవల్ని కూడా అందిస్తున్నాయి. అయితే ఇందుకోసం మీరు కమిషన్లను, అదనపు కరెన్సీ మార్పిడి ఖర్చులను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, మీరు విదేశీ మారకపు రేట్లను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మీరు భారత్ లో పెట్టుబడులు పెట్టేముందు మీకు ఉత్తమ మార్పిడి రేటు వచ్చేలా చూసుకోవాలి. అలానే, బదిలీ ఫీజులో మీకు కొంత ఆదా అయ్యేలా చూసుకోవాలి.
ఎడిఆర్ లేదా జిడిఆర్ లలో పెట్టుబడి పెట్టడం:
అమెరికన్ డిపాజిటరీ రశీదులు (ఎడిఆర్) లేదా గ్లోబల్ డిపాజిటరీ రశీదులు (జిడిఆర్) ల ద్వారా మీరు భారత్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టవచ్చు.
ఇండియా ఫోకస్డ్ ఈటీఎఫ్:
iShares MSCI India ETF (INDA), విజ్డమ్‌ట్రీ ఇండియా ఎర్నింగ్స్ ఇటిఎఫ్ (IXSE), ఫ్రాంక్లిన్ FTSE ఇండియా ETF (FLIN), మొదలైన ఇండియా ఫోకస్డ్ ఈటీఎఫ్ లు విదేశీ పెట్టుబడిదారులకు మంచి ఛాయిస్ లు గా ఉన్నాయి.
పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ (పిఐఎస్):
విదేశీ పెట్టుబడిదారుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ (పిఐఎస్) అనే పథకాన్ని అభివృద్ధి చేసింది. పిఐఎస్ పధకం కింద ఫారినర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులను పెట్టవచ్చు.
విదేశాల నుంచి భారత్ లో స్టాక్ మార్కెట్ మేనేజ్ చేయడం ఎలా..?
విదేశాల నుంచి భారత్ లో స్టాక్ మార్కెట్ మేనేజ్ చేయడం కోసం , మీ NRE / NRO ఖాతాలను నిర్వహించడానికి తప్పనిసరి హోల్డర్‌ను సూచించాల్సి ఉంటుంది. మీ డాక్యూమెంట్లతో పాటు, మీ హోల్డర్ సంతకం తో పాటు “మాండేట్ హోల్డర్ నియామకం” దరఖాస్తును అందించాల్సి ఉంటుంది. అలాగే, మీ పెట్టుబడులను ట్రాక్ చేయడానికి మరియు నిర్వహించడానికి భారతదేశంలో పవర్ ఆఫ్ అటార్నీ (పిఒఎ) ను నియమించుకోవాలి. చాలా మంది బ్రోకర్లకు ఆన్‌లైన్ ట్రేడింగ్ సౌకర్యాలు ఉన్నాయి. మీ KYC మార్గదర్శకాలను పూర్తి చేసిన తర్వాత, మీరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో వ్యాపారం ప్రారంభించవచ్చు.
End of Article