స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి..? ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు..?

స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి..? ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు..?

by Anudeep

Ads

తక్కువ కాలం లో ఎక్కువ మొత్తం లో డబ్బు సంపాదించుకోవాలన్నా, సంపాదించుకున్న డబ్బును ఇన్వెస్ట్ చేసి మరింతగా పెంపొందించుకోవడానికి చాలా మంది స్టాక్స్ వైపు చూస్తుంటారు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి సంపాదన పెంచుకోవాలనుకుంటారు. అయితే.. స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్న సంగతి ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

stock markets

స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు డిమాట్ అకౌంట్ ను ఓపెన్ చేసుకోవాలి. ఈ అకౌంట్ ను ఎలా ఓపెన్ చేసుకోవాలో ఈ కింది లింక్ లో చదవండి.

 

డిమాట్ అకౌంట్ గురించి తెలుసుకున్నాక, మీరు ట్రేడింగ్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. భారతీయ షేర్ మార్కెట్ ప్రకారం, మీరు ట్రేడింగ్ చేస్తున్నపుడు.. అంటే, మీ ట్రేడింగ్ అకౌంట్ నుంచి షేర్ ని కొంటున్నపుడు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు చెల్లిస్తారు. అలానే ఈ షేర్ మాత్రం మీ డిమాట్ అకౌంట్ లో చూపించబడుతుంది. మీరు బ్యాంకు అకౌంట్ లో ఏవిధం గా డబ్బులు డిపాజిట్ చేస్తారో.. అలా షేర్ డిమాట్ అకౌంట్ కి డిపాజిట్ అవుతుంది. మీరు షేర్ వేల్యూ ని చెక్ చేసుకోవాలి అనుకుంటే డిమాట్ అకౌంట్ లో చూసుకోవాలి. అదే మీరు ఆ షేర్ ని అమ్మేస్తే.. ఆ షేర్ షేర్ మార్కెట్ లోకి వెళ్ళిపోతుంది. అమ్మగా వచ్చిన డబ్బు మీ బ్యాంకు అకౌంట్ లో పడుతుంది.

stock markets 2

స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ప్రారంభించే ముందు డిమాట్ అకౌంట్ తో పాటు, ఒక ఇన్వెస్టర్ ట్రేడింగ్ అకౌంట్ ను కూడా ఏర్పాటు చేసుకోవాలి. డిమాట్ అకౌంట్ ను బ్యాంకు ఖాతా కు లింక్ చేసి ఉంచాలి. దీని వలన ఆన్ లైన్ లో చెల్లింపులు, డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడం తేలిక అవుతుంది. ట్రేడింగ్ అకౌంట్ ద్వారా మీరు ఈక్విటీ షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఐపిఓ లలో కూడా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. మీరు ఖాతాలను తెరుచుకునే ముందు సురక్షితమైన సంస్థలతో బ్రోకరేజి కలిగిఉండడం ముఖ్యం. తద్వారా మీ లావాదేవీలు సురక్షితం గా ఉంటాయి.

stock markets 3

ఇలా షేర్స్ లో పెట్టుబడి పెట్టేముందు మీరు ఆన్ లైన్ స్టాక్ సిములేటర్ తో ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా. మీరు ఇలా ప్రాక్టీస్ చేయడం వలన మీకు సరైన అనుభవం వస్తుంది. ట్రేడింగ్ సమయం లో ఇబ్బందులు లేకుండా మీరు షేర్ లు కొనడం అమ్మడం చేయగలుగుతారు. ఫలితం స్టాక్స్ ని కోల్పోకుండా స్టాక్ మార్కెట్ లో ఎలా బిజినెస్ చేయాలో అర్ధం అవుతుంది.

stock markets 4

స్టాక్ మార్కెట్ లో బిజినెస్ చేసేటపుడు తక్కువ రిస్క్ తో అధిక లాభాలు వచ్చే పధ్ధతి ని ఎంచుకోవడం మంచిది. ఎక్కువ రిస్క్ తీసుకుని అత్యధిక లాభాల కోసం ప్రయత్నిస్తే.. నష్టపోతే ఎక్కువ మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి, నష్టాలు తక్కువ వస్తూ లాభాలు ఎక్కువ వచ్చే విధం గా మీకు సొంతం ఓ వ్యూహాన్ని సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళండి. ఇంకా వ్యూహాత్మకం గా ముందుకు వెళ్లాలనుకుంటే.. మీకు ఇన్వెస్ట్మెంట్ కోర్స్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని చదువుకుని స్టాక్ బిజినెస్ ప్రారంభించవచ్చు.


End of Article

You may also like