మీ చుట్టూ ఉండే వారు ఎలాంటి వారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే.. చాణుక్యుడు చెప్పిన ఈ 4 విషయాలు ​పాటించండి.!

మీ చుట్టూ ఉండే వారు ఎలాంటి వారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే.. చాణుక్యుడు చెప్పిన ఈ 4 విషయాలు ​పాటించండి.!

by Anudeep

Ads

చాణుక్యుడు భారతీయులందరికి సుపరిచుతుడే. అర్ధశాస్త్రాన్ని ఔపోసన పట్టి, సకల రాజనీతి జ్ఞానాన్ని సముపార్జించిన వాడు చాణుక్యుడు. అర్ధశాస్త్రాన్ని రచించింది ఈయనే అని మనకి తెలిసినదే. ఈయన రచయిత గా, సలహాదారుని గా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. ఈయన చెప్పిన నీతి సూత్రాలు నేటికీ ఆచరించుకుని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

Video Advertisement

chanakya 1

అయితే, మన చుట్టూ ఉండే వ్యక్తుల స్వభావాలను ఎలా తెలుసుకోవచ్చో కూడా చాణుక్యుడు వివరించాడు. అందుకు నాలుగు అంశాలను పరిశీలించాలని తెలిపాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

#మీ చుట్టూ పక్కల వ్యక్తుల వ్యక్తిత్వాన్ని అంచనా వేసే ముందు వారి స్వభావాన్ని గమనించండి. పరిస్థితులలో.. వారి పాత్ర ఏ విధం గా ఉంటోందో అంచనా వేయాలి. కొంత మంది మంచి స్వభావం ఉన్న వారు అయితే.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అర్ధం చేసుకుంటారు. అలాంటి వారిని మనం నిస్సందేహం గా నమ్మవచ్చు.

# మరో విషయం ఏమిటంటే.. వారి లక్షణాలను గమనించి ఒక అంచనా కు రావాలి. అహంకారం, అబద్ధాలు చెప్పే స్వభావం, కోపం, స్వార్ధం, సోమరితనం ఇలాంటి లక్షణాలు ఉన్న వారు అయితే.. వారిని ఎప్పటికీ నమ్మకండి. అలాగే ఎల్లప్పుడూ మర్యాదను ఇచ్చిపుచ్చుకుంటూ, ప్రశాంతం గా, నిజాయితీ గా జీవనం గడిపేవారిని విశ్వసించండి.

chanakya 1

# సాధారణం గా వ్యక్తులు స్వార్ధ భావనతోనే ఉంటారు. తమ గురించి తామే ఆలోచించుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొందరు పరిత్యాగిలా ఇతరుల పట్ల కూడా త్యాగ భావాన్ని చూపిస్తూ ఉంటారు. మానవత్వం ఉన్న వ్యక్తులు మాత్రమే ఇలా ఆలోచించగలుగుతారు. మీ చుట్టూ ఉన్న వారిలో ఇలాంటి వారు ఎవరైనా ఉంటె వారిని కచ్చితం గా నమ్మొచ్చు.

Pressures faced by the people who got married after 30 years

# ధర్మం, అధర్మం అన్నవి అన్నిచోట్లా ఉంటాయి. ఓ వ్యక్తి స్వభావాన్ని పరిశీలించేటప్పుడు అతను ధర్మ మార్గం లో వెళ్తున్నాడా..? అధర్మ మార్గం లో వెళ్తున్నాడా? అన్న విషయాన్ని కచ్చితం గా పరిశీలించాలి. ధర్మ మార్గం లో నడిచేవారు విషయం లో అనుమానం అవసరం లేదు. కానీ, అధర్మ మార్గాన్ని అనుసరించేవారు ఎప్పటికైనా మోసం చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించక తప్పదు.


End of Article

You may also like