ప్రస్తుతం మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. మన బరువు మనకు చాలా సార్లు ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. మనలో చాలా మంది బరువు తగ్గాలనుకున్నప్పటికీ తగ్గ లేకపోతారు. అయితే.. బరువు తగ్గించుకోవాలి అనుకోగానే చాల మంది చేసే మొట్ట మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. దానికి కారణం ఏంటంటే వైట్ రైస్ వలన చాలా కాలరీస్ అందుతాయి కాబట్టి బరువు పెరిగిపోతూ ఉంటామని భావిస్తూ ఉంటారు.

white rice 1

అది కూడా నిజమే. 100 గ్రాముల ఉడికించిన వైట్ రైస్ వలన మనకు కనీసం 400 కాలరీస్ లభిస్తాయి. ఇవి కరిగించుకోవాలంటే మనం కనీసం గంట అయినా నడవాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది రైస్ ను తగ్గించుకుని తక్కువ కాలరీస్ ఉండే చపాతీ, సలాడ్ వంటి వాటిని ఆహరం గా తీసుకుంటూ ఉంటారు. అయితే.. ఇవేవి మనకు అన్నం ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ ఇవ్వవు. అందుకే చాల మంది కంట్రోల్ చేసుకోలేక అన్నం తినేస్తూ ఉంటారు.

white rice 2

ఇక నుంచి ఆ ఇబ్బంది అవసరం లేదు. కాలరీస్ తక్కువ లభించే విధం గా అన్నం వండుకోవచ్చు. ఒకప్పుడు ఎక్కువ గా శారీరక శ్రమ ఉండేది కాబట్టి ఎంత ఎక్కువ గా అన్నం తిన్నా ఎవరికి అధిక బరువు సమస్య వచ్చేది కాదు. కానీ.. ఇప్పుడు అందరం ఇంటికే పరిమితం అవుతున్నాం.. అంత ఎక్కువ పనులు ఎవరికి ఉండడం లేదు. అందుకే మనం తీసుకునే ఆహరం విషయం లో జాగ్రత్త గా ఉండాలి. మనం అన్నం రెండు రకాలుగా వండుతాం. కుక్కర్ లో పెట్టి వండడం లేదా గంజి వార్చి వండడం. ఎలా వండినా అన్నం వండే ముందు బియ్యం, నీటితో పాటు కొంచం కొబ్బరినూనె (తలకు రాసుకునేది కాదు.. వంటలో ఉపయోగించేది) కూడా వేయాలి. ఇలా వండిన అన్నాన్ని చల్లార్చిన తరువాత 12 గంటల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచేసి.. ఆ తరువాత ఉదయాన్నే వేడి చేసుకుని తినడమే.

white rice 3

అన్నాన్ని ఇలా వండుకోవడం వలన అన్నం లోని కార్బోహైడ్రాట్స్ రెసిస్టెంట్ స్టార్చ్ అనే పిండిపదార్ధం గా మారిపోతుంది. సైంటిస్ట్ ల సర్వేలలో కూడా ఈ విషయం తేలింది. ఇలాంటి అన్నం తినడం వలన మనకు సాధారణం గా లభించే కాలరీస్ కంటే సగం కాలరీస్ లభిస్తాయట. దీని వలన బరువు పెరగకుండా ఉంటాము. కొబ్బరినూనె అన్నాన్ని తినడం వలన శరీరం లో ఉండే చెడు కొలెస్టిరాల్ కూడా కరిగి ఆకలి వేయకుండా ఉంటుందట.

white rice 4

కొంచం అన్నం తిన్నా సరే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుందట. ఇలా వండిన అన్నం మధుమేహం ఉన్న వారికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. రక్తం లో చక్కర స్థాయిని కంట్రోల్ లో ఉంచుతుంది. మలబద్దకం పోయి జీర్ణ వ్యవస్థ సక్రమం గా పనిచేస్తుంది. శరీరం లోని చెడు బాక్టీరియా తొలగి పోయి మంచి బాక్టీరియా డెవలప్ అయ్యి శరీరాన్ని ఆరోగ్యం గా ఉంచుతుంది.