ఇన్స్టంట్ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ ను ఉపయోగించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కేవలం మెసేజెస్ పంపించుకునే అప్లికేషన్ లాగా మొదలయ్యి.. ప్రస్తుతం అనేక ఫీచర్లను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. వాటిల్లో ఒకటి వాట్సాప్ డిలీట్ ఫీచర్. వాట్సాప్ లో మెస్సేజెస్ ని మనం పొరపాటున పంపించినా.. వాటిని వెంటనే డిలీట్ చేసేసుకునే అవకాశం ఉంది. అయితే… మెసేజ్ డిలీట్ అయిపోతే.. రిసీవ్ చేసుకున్న వారు దానిని చూడలేరు.

whatsapp

పైకి చెప్పకపోయినా.. మనలో చాలా మందికి ఎవరైనా మెసేజ్ పెట్టి మనం చూసే లోపు డిలీట్ చేస్తే.. వారు ఏమి డిలీట్ చేశారు అన్న డౌట్ రావడం సహజం. కొన్నిసార్లు మనకు వారు ఏమి మెసేజ్ పెట్టారో చూడాలన్న కుతూహలం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఈ మెసేజ్ లను సీక్రెట్ గా తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి whatsremoved+ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ను డౌన్లోడ్ చేసి.. ఇన్స్టాల్ చేసి ఆ తరువాత పెర్మిషన్స్ ను ఎనేబుల్ చేసుకోవాలి. ఆ తరువాతే మీరు మెసేజ్ లు చూడగలుగుతారు.

deleted message1

ఏ యాప్ లో డిలిటెడ్ డేటా చూడాలనుకుంటున్నారో ఆ యాప్ లకు పర్మిషన్ ఇవ్వాలి. ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ మెసెంజర్, టెలిగ్రామ్, వాట్స్ ఆప్ వంటివాటిల్లో డిలీట్ అయిపోయిన మెసేజ్ లు మీరు చూడాలంటె ఆ యాప్ లను యాక్సెస్ చేయడానికి whatsremoved+ యాప్ కు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత ఫైల్స్ సేవ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. మీకు ఎలా నోటిఫికేషన్ వస్తుందో.. అలానే.. డిలీట్ అయిన మెసేజ్ లు కూడా whatsremoved+ యాప్ లో సేవ్ అవుతాయి. అవి చూడాలనుకుంటే మీరు whatsremoved+ యాప్ ఓపెన్ చేసి అందులో వాట్సాప్ ను సెలెక్ట్ చేసుకుని చూడాల్సి ఉంటుంది.

deleted message 2

వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ చదవడానికి ఫీచర్ లేదు. అందుకే మీరు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే.. whatsremoved+ యాప్ వలన నష్టాలూ కూడా ఉన్నాయి. ఈ యాప్ మీ పర్సనల్ డేటా ను కూడా యాక్సెస్ చేయగలదు. థర్డ్ పార్టీ యాప్ లకు మీ డేటా ను షేర్ చేసే అవకాశం ఉంది. వాట్సాప్ నోటిఫికెషన్స్ తో పాటు మీ మొబైల్ కి వచ్చే బ్యాంకు మెసేజ్స్, ఓటీపీ మెసేజ్ లు కూడా whatsremoved+ యాప్ చదవగలదు.. అందుకే ఈ యాప్ ను రెగ్యులర్ గా యూజ్ చేయడం కంటే అవసరం అయినపుడు ఉపయోగించడం మంచిది.