ప్రస్తుతం ఎక్కడ చూసినా వాక్సిన్ గురించే.. కరోనా మహమ్మారి ని తరిమి కొట్టడానికి అందుబాటులో ఉన్న ఆయుధం వాక్సిన్ ఒక్కటే.. మన జాగ్రత్తలు మనం తీసుకోవడం తో పాటు.. వాక్సిన్ తీసుకోవడం ప్రస్తుతం మనం చేయగలిగినది. అయితే.. మే ఒకటవ తేదీ నుంచి పద్దెనిమిది సంవత్సరాలు పైబడ్డ వారందరికీ వాక్సిన్ ను ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే.. వాక్సిన్ వేయించుకోవడానికి ఎలా రిజిస్టర్ చేయించుకోవాలో ఇప్పుడు చూడండి..

vaccine 2

వాక్సిన్ వేయించుకోవాలనుకునే వారు ఆరోగ్య సేతు యాప్, కోవిన్ యాప్( ఆంధ్ర ప్రదేశ్), లేదా వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఆప్ లో ఎలా నమోదు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం

# ముందు ఫోన్ లో కోవిన్ లేదా ఆరోగ్య సేతు ఆప్ ను డౌన్లోడ్ చేఉస్కోవాలి.
# మీ మొబైల్ నెంబర్ తో యాప్ లో లాగిన్ అవ్వాలి. ధ్రువీకరణ కోసం ఓటీపీ నెంబర్ ను కూడా ఎంటర్ చేయాలి.

vaccine 3
# మీ పేరు, పుట్టిన తేదీ, మీ వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలతో మీ ప్రొఫైల్ ను సెట్ చేసుకోవాలి.
# మీకు దగ్గరలోని వాక్సినేషన్ కేంద్రాన్ని చూసుకుని.. మీకు వీలైన తేదీలో షెడ్యూల్ చేసుకోవచ్చు. (కావాలనుకుంటే డేట్ ను మార్చుకోవచ్చు.)
# మీకు అప్పోయింట్మెంట్ కంఫర్మ్ అయిన తరువాత మీకు ఒక ఎస్ఎం ఎస్ వస్తుంది. మీ రిజిస్ట్రేషన్ పూర్తయినట్లే..

vaccine 4

# మీరు వాక్సిన్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. వారు పత్రాలను వెరిఫై చేసాక వాక్సిన్ వేస్తారు.
# మొదటి డోసు వాక్సిన్ వేయించుకున్నాక… రెండవ డోస్ 28 రోజుల తరువాత వేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఆటోమేటిక్ గానే రిజిస్టర్ అయిపోతుంది. రెండు డోసులు వేయించుకున్న తరువాత, మీరు వాక్సిన్ వేయించుకున్నట్లు గా సర్టిఫికెట్ ను కూడా తీసుకోవచ్చు.

vaccine 5

ఒకవేళ మీరు వెబ్ సైట్ ద్వారా వేయించుకోవాలనుకుంటే..
# మొదట అధికారిక వెబ్సైటు www.cowin.gov.in లోకి వెళ్లి మీ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
# వెబ్ సైట్ ఓపెన్ చేసాక, మీకు Register/ Sign in yourself అనే బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఆ తరువాత మీ ఆధార్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి.
# మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ ను అక్కడ ఎంటర్ చేయాలి.
# మీ ఏజ్, నేమ్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.. ఆ తరువాత ఏదైనా గుర్తింపు కార్డు అప్లోడ్ చేయాలి.
# ఆ తరువాత మీ అప్పోయింట్మెంట్ తేదీని, ప్లేస్ ను ఖరారు చేసుకోవాలి. ఆ తరువాత యాడ్ మోర్ అనే ఆప్షన్ ద్వారా మరో ముగ్గురిని కూడా యాడ్ చేయవచ్చు.

vaccine 6

ధ్రువీకరణ పత్రాలు:
1. ఓటర్ ఐడి
2. ఆధార్ కార్డు
3. పాన్ కార్డు
4. డ్రైవింగ్ లైసెన్స్
5. హెల్త్ ఇన్సూరెన్సు కార్డు
6. పాస్ పోర్ట్
7. బ్యాంకు/పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్స్
8. పెన్షన్ కార్డ్స్
9. గవర్నమెంట్ కార్డ్స్
10. ప్రభుత్వ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కార్డ్స్

vaccine 1

ఈ విషయాలను మర్చిపోకండి:
#వ్యాక్సినేషన్ కేంద్రాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాక్సిన్ ను వేస్తారు.
#మీరు మొదటి డోసు తీసుకున్నాక 28 డేస్ కి సెకండ్ డోస్ తీసుకోవాలి.
#టీకా కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న సమయం లో ఏ డాకుమెంట్స్ అప్లోడ్ చేసారో.. వాటి ఒరిజినల్స్ ను మీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
#రిజిస్ట్రేషన్ అయ్యాక మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కచ్చితం గా వస్తుంది.
#రాష్ట్రము, జిల్లా పిన్ కోడ్ లను ఎంటర్ చేయడం ద్వారా మీకు సమీపం లో ఉండే వ్యాక్సినేషన్ కేంద్రాలను ఎంచుకోవచ్చు.
#అప్పోయింట్ మెంట్ బుక్ అయినా తరువాత, “అపాయింట్‌మెంట్ సక్సెస్‌ఫుల్” అని కనిపిస్తుంది. ఈ పేజీ ను డౌన్లోడ్ చేసుకుని ఉండడం మంచిది.
#మీకు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటె.. వాటికి సంబంధించిన డాక్యూమెంట్స్ కూడా తీసుకెళ్లడం మంచిది.
#వాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాకా.. మీరు వేరే సిటీ కి వెళ్లాల్సి వస్తే.. అక్కడ కూడా దగ్గరలోని వ్యాక్సినేషన్ కేంద్రం లో సెకండ్ డోస్ తీసుకోవచ్చు.


ఇక ఇంటినుంచి ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించండి - CLICK   HERE