Ads
ప్రస్తుతం మనీ ట్రాన్సాక్షన్ అనగానే మనకి మొదటగా గుర్తుకు వచ్చేది ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం. ప్రస్తుతం ఎక్కువగా ఈ అప్లికేషన్లను ఉపయోగించే నగదును బదిలీ చేస్తూ ఉంటారు. అయితే.. ఈ అప్లికేషన్స్ లో నగదు బదిలీ చేయాలి అంటే యూపీఐ పిన్ తప్పనిసరిగా ఉండాలి.
Video Advertisement
ఒకవేళ పొరపాటున ఈ పిన్ ని మరిచిపోతేనో..? ఏం గాభరా పడకండి.. కొన్ని స్టెప్స్ ను ఫాలో అయితే మీ యుపిఐ పిన్ ను తిరిగి రీసెట్ చేసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.
# మొదట మీ పేమెంట్ యాప్ ను ఓపెన్ చేయాలి. యాప్ లోనే బ్యాంకు ఖాతా అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
# అక్కడ Forget UPI Pin అనే ఆప్షన్ ను ఎంచుకుని.. ఏ బ్యాంకు ఖాతా యూపీఐ పిన్ ను మర్చిపోయారో ఆ బ్యాంకు ఖాతాను సెలెక్ట్ చేసుకోవాలి.
# ఆ తరువాత మీ ఎటిఎం కార్డు లోని చివరి ఆరు సంఖ్యలతో పాటు గడువు తేదీ’ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
# మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ని ఎంటర్ చేయాలి.
# ఆ తరువాత మిమ్మల్ని కొత్త యూపీఐ పిన్ ను సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీరు కొత్త యూపీఐ పిన్ ను ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది.
End of Article