మీ పిల్లలు తినే విషయంలో మారాం చేస్తున్నారా..! వాళ్లకు “ఎలాంటి పోషకాలు అందించటం ద్వారా ఆరోగ్యంగా ఉంటారో తెలుసుకోండి”..!

మీ పిల్లలు తినే విషయంలో మారాం చేస్తున్నారా..! వాళ్లకు “ఎలాంటి పోషకాలు అందించటం ద్వారా ఆరోగ్యంగా ఉంటారో తెలుసుకోండి”..!

by Anudeep

Ads

పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించడంలో ప్రతి తల్లి సవాల్ ఎదుర్కొంటుంది. పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే వారి శరీరానికి అన్ని రకాల పోషకాలు అవసరం. అయితే చిన్నప్పటి నుంచి పిల్లలు మనం చేసే ఆహారం అలవాట్ల వల్ల ఒకే రకమైన పదార్థాలు తినడానికి ఇష్టపడతారు.

Video Advertisement

ప్రతి తల్లి ముందు బిడ్డకి ప్రొటీన్లు ఎక్కువగా అందుతాయని పప్పుధాన్యాలతో చేసిన కూరలు లేదా మాంసకృత్తులు ఎక్కువగా అలవాటు చేస్తూ ఉంటారు. అలా అలవాటు చేయడం ద్వారా పిల్లల్లో తరచుగా ఒకే రకమైన రుచి కలిగిన ఆహారం తినడానికి ఆసక్తి చూపుతారు. ఇలా ఒకే రకమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి సరైన పోషకాలు అందకపోవచ్చు.

మరి ఎలాంటి ఆహారం అలవాట్లు చేయటం ద్వారా బిడ్డకు మంచి పోషకాలు అందుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం

10 ఏళ్ల వయసు వచ్చేసరికి పిల్లలకు అన్ని రకాల ఆహారపదార్థాలు తినే అలవాటు వచ్చి ఉండాలి. మనం ఎక్కువగా పిల్లలకు అన్నం, చికెన్, పప్పు కూరలు వంటివి ఎక్కువగా తినిపిస్తాము. కూరగాయలు, ఆకుకూరల వంటివి దగ్గరకు కూడా రానివ్వరు.

ఈ కూరగాయలు ఆకుకూరలు అనేక రకమైన ఖనిజలవణాలు, విటమిన్లు ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని పిల్లలు దూరం పెట్టడం ద్వారా వల్ల శరీరానికి సరైన పోషకాలు అందవు.

కూరగాయల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లల జీర్ణశక్తి సక్రమంగా పని చేసి మలబద్ధకాని తగ్గిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, మైక్రో న్యూట్రియంట్స్ వంటి పోషకాలు కూరగాయలు మరియు ఆకుపచ్చని ఆకుకూరలు ద్వారానే లభిస్తాయి. ఈ పోషకాలు శరీరాన్ని అనారోగ్యాల బారి నుంచి కాపాడతాయి.

ప్రతి రోజు పిల్లలకు 150 నుంచి 200 గ్రాములు కూరగాయలు , 50 నుంచి 100 గ్రాములు ఆకుకూరలు ఆహారంగా తీసుకొనే అలవాటు చేయాలి. ప్రతి ఒక్క కూరగాయల్లోనూ అంటే క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయ బెండకాయ, టమోటా, తోటకూర, పాలకూర, ప్రతి ఒక్క దానిలో ఒక ప్రత్యేకమైన పోషక విలువలు ఉంటాయి.

ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల పిల్లలు రక్తహీనతకు లోనవ్వకుండా కాపాడవచ్చు.  పోషకాలు సక్రమంగా అందినప్పుడే ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. అదేవిధంగా సీజన్లో ప్రతి పండును పిల్లలు తినే విధంగా అలవాటు చేయాలి.

ఫ్రూట్ ను రకరకాల షేప్ లో కట్ చేసి పిల్లలు ఎదుట పడితే వారు ఇష్టంగా తినడానికి ఆసక్తి చూపుతారు.  ప్రతీ పండ్లు మరియు కూరగాయలోని ఎలా పోషకాలు ఉంటాయనే విషయాన్ని వాళ్లకు ఖచ్చితంగా తెలియజేయాలి.

ఎప్పుడైతే పిల్లలు సరైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటారో వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా మారతారు.


End of Article

You may also like