మీరు వాడే పాలు స్వచ్ఛమైనవా? కల్తీవా? అనేది ఈ చిన్న ట్రిక్ తో తెలుసుకోండి..!

మీరు వాడే పాలు స్వచ్ఛమైనవా? కల్తీవా? అనేది ఈ చిన్న ట్రిక్ తో తెలుసుకోండి..!

by Anudeep

Ads

ప్రస్తుతం ఎక్కడ చూసినా ధనమే కనిపిస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని డబ్బుతోనే కొలుస్తున్నారు. డబ్బు కోసమే ఏ పనిని అయినా చేస్తున్నారు.

Video Advertisement

చివరకు ఆహార పదార్ధాలు కూడా డబ్బు సంపాదించే సాధనాలు అయిపోయాయి. ఎక్కువ డబ్బుకు ఆశపడి కొందరు ఆహార పదార్ధాలను కల్తీ చేయడం ప్రారంభించేసారు.

milk 3

పాలు, నెయ్యి, పెరుగు వంటివి కూడా కల్తీ లేకుండా వస్తున్నాయని మనం చెప్పలేం. కొంతమంది కొద్ది మొత్తం లో నీటిని కలిపి పాలు అమ్ముతూ ఉంటారు. ఇది కొంతవరకు నయమే అనుకోవచ్చు. కార్పొరేట్ వ్యాపారాలు వచ్చాక.. పాలని కూడా మనకి తెలియకుండానే కల్తీ చేసేస్తున్నారు. అయితే.. మనం ప్యాకెట్స్ లో తెచ్చుకుంటున్న పాలు కల్తీవో కాదో మనమే తెలుసుకోవచ్చు.

milk 1
అదెలా అంటే.. ఏటవాలు గా ఉన్న ప్రాంతం పై ఒక పాల చుక్క వేసి చూడండి. ఆ పాలలో నీటిని కలపకుండా ఉంటె ఆ పాల చుక్క నెమ్మదిగా జారుతూ తెల్లటి చారను వదులుతుంది. అదే  అందులో నీటిని కలిపితే.. సర్రున జారిపోతుంది. ఇక కొందరైతే పాలను కృత్రిమం గా తయారు చేసి అమ్ముతున్నారు. ఒక టెస్ట్ ట్యూబ్ లో పాలు, యూరియా ను ఆడ్ చేయండి. ఆ తరువాత కొద్ది గా పసుపు కూడా వేయండి. బాగా కలిపిన తర్వాత ఎరుపు రంగు లిట్మస్ పేపర్ తో టెస్ట్ చేయండి. ఆ పేపర్ నీలి రంగులోకి మారితే.. పాలల్లో యూరియా కలిసింది అని అర్ధం..

milk 2

ప్రస్తుతం కల్తీ పాలను గుర్తించడానికి ప్రతి షాప్ లో యూరియా స్ట్రిప్స్ దొరుకుతున్నాయి. వీటితో కూడా టెస్ట్ చేసి పాలు కల్తీ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. కొంతమంది కృత్రిమ సింథటిక్ పాలను అమ్ముతున్నారు. ఈ పాలను చర్మం పై వేసుకుని రుద్దితే సబ్బు రుద్దిన ఫీలింగ్ వస్తుంది. అలాగే వీటిని కాచిన తరువాత లేత పసుపు రంగులోకి మారిపోతాయి. ఇలాంటి పాలను తాగడం వలన ఎదుగుదల సంగతి పక్కన పెడితే, ఆరోగ్యం కుంటుపడుతుంది. కనుక మీరు తాగే పాల విషయం లో శ్రద్ధ వహించండి.


End of Article

You may also like