“భద్ర తిధి”తో కలిసి వచ్చిన రాఖీ పౌర్ణమి..! ఇలా వచ్చినప్పుడు రాఖీ కట్టొచ్చా..? ఒకవేళ కడితే ఏం జరుగుతుంది..?

“భద్ర తిధి”తో కలిసి వచ్చిన రాఖీ పౌర్ణమి..! ఇలా వచ్చినప్పుడు రాఖీ కట్టొచ్చా..? ఒకవేళ కడితే ఏం జరుగుతుంది..?

by Anudeep

Ads

అన్నా చెల్లెలు ఎంతో అనుబంధంతో జరుపుకునే పండగ రాఖీ పౌర్ణమి. ఎల్లవేళలా ఎటువంటి పరిస్థితుల్లో తనకి అండగా నిలబడి రక్షణ ఇస్తాడు అన్న నమ్మకాన్ని పవిత్రమైన దారం రూపంలో తన అన్న చేతికి ప్రతి చెల్లి కట్టేది రాఖీ.
అలాంటిది ఈ సంవత్సరం రాఖీ పౌర్ణిమ భద్ర తిథి తో కలిపి వస్తుంది.

Video Advertisement

మరి భద్ర తిధితో కలిసి వచ్చిన ఈ రాఖీ పౌర్ణిమ ఈ సంవత్సరం జరుపుకోవడం కుదురుతుందా…రాఖీ కట్టడానికి అనువైన సమయం లేదు……అనే విషయం తెలుసుకోవడానికి ముందు అసలు భద్ర తిథి అంటే ఏంటో తెలుసుకుందాం.
మన హైందవ సాంప్రదాయం ప్రకారం భద్ర తిథి అనేది ఎటువంటి శుభకార్యాలు చేయడానికి ఉపయోగపడదు. అంతేకాకుండా ఈ భద్ర తిథి లో చేసే ఎటువంటి శుభకార్యాలకైనా అశుభ ఫలితాలు ఉంటాయి అనేది పెద్దల నమ్మకం.

rakhi

ఈ భద్రా ముహూర్తంలో ఎటువంటి శుభకార్యాలు చేసిన అశుభాలు కలుగుతాయని సాక్షాత్ బ్రహ్మహే శపించాడు. రావణుడి సోదరుడు సూపర్ అక్క ఈ భద్రా ముహూర్తంలో అతనికి రాఖీ కట్టడం వల్లే రావణుడి వంశం నాశనమైందని పురాణ గాధ.
మన పురాణాల ప్రకారం సూర్యదేవుడికి ఛాయాదేవికి జన్మించిన పుత్రిక ఈ భద్రా మాత. ఎంతో కఠినమైన స్వభావం కలిగిన ఈ భద్రా మాత ఒకసారి సమస్త విశ్వాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఇది తప్పు అని వివరించిన బ్రహ్మ ఆమెకు ఏడవకరణ విస్టిగా కరణాలలో ఆమెకు స్థానం కల్పించాడు.

Rakhi Pournami

శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రంతో కూడిన మాసాన్ని శ్రావణ మాసం అని పిలుస్తారు, ఈ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు రాఖీ పౌర్ణిమ జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి యొక్క సమయం ఆగస్ట్ 11 ఉదయం 10 గంటల 38 నిమిషాల నుండి ఆగస్టు 12వ తేదీ ఉదయం 7 గంటల 5 నిమిషాల వరకు ఉంది. కాగా భద్ర తిథి మాత్రం 11 వ తారీకు రాత్రి 8 గంటల 51 నిమిషాల వరకు ఉంది. కాబట్టి ఈ సంవత్సరం రాఖీ పౌర్ణిమ చేసుకోదగ్గ శుభ సమయం 11వ తేదీ రాత్రి 81 నిమిషాల తరువాత ఆగస్టు 12వ తారీకు ఉదయం 7 గంటల 5 నిమిషాల లోపల.

ఇది ఇలా ఉండగా ఆగస్టు 12వ తారీకు ఉదయం పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు అంతటినీ కూడా రాఖీ పౌర్ణమి గా జరుపుకోవాలని మన వేద పండితులు చెబుతున్నారు. అందునా ప్రత్యేకించి ఆగస్టు 12వ తారీకు మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల నుంచి 3గంటల 22 నిమిషాల మధ్య కాలం రాఖీ పండుగ జరుపుకోవడానికి శుభప్రదంగా ఉంది. ఈ పండుగ ఆగస్టు 12వ తారీకు నిరభ్యంతరంగా జరుపుకోవచ్చు కానీ ఆ రోజు ఉన్న రావు కాలాలు యమగండాలు జాగ్రత్తగా చూచుకొని పైన చెప్పిన శుభముహూర్తంలో జరుపుకోవడం మంచిది.


End of Article

You may also like