Ads
చేతులు కడుక్కోవడం అనేది మనకి చిన్నప్పటి నుండి ఉన్న అలవాటు. మనం ఎక్కువగా చేతులతో పనుల చేస్తాం కాబట్టి చేతులు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే . అందుకే భోజనానికి ముందు , బాత్రూం కి వెళ్లి వచ్చిన తర్వాత , లేదంటే ఏవైనా పనులు చేసినప్పుడు మనకి చేతులు కడుక్కోవడం అనేది అలవాటు . కానీ హ్యాండ్ వాష్ చేసుకునే వాళ్లల్లో కేవలం 5% మాత్రమే చేతుల్ని శుభ్రంగా కడుక్కుంటున్నారని , మిగతా 95% తప్పుగా హ్యాండ్ వాష్ చేస్కుంటున్నారని మిచిగాన్ యూనివర్శిటి చేసిన అధ్యయనంలో తేలింది.
Video Advertisement
ఏ విధంగా హ్యాండ్స్ వాష్ చేసుకుంటే చేతులపై ఉండే క్రిములు నశిస్తాయనేది ఇప్పుడు తెలుసు కోవడం చాలా అత్యవసరం. ఎందుకంటే ఏ వైరస్ ఎటు వైపు నుండి దాడి చేస్తుందో తెలీదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం ఉత్తమం.
చాలామంది చేతుల్ని సబ్బుతో, హ్యాండ్ వాష్ తో వాష్ చేస్తుంటారు. కానీ ఎంతసేపు ఇలా ట్యాప్ విప్పి అలా చేతులు ఒకట్రెండు సార్లు రబ్ చేసి అంటే కనీసం ఐదు నుండి పది సెకన్లలో హ్యాండ్ వాష్ కంప్లీట్ చేస్తారు. దీనివలన చేతిపై క్రిములు నశించవు సరికదా, ఆ సోప్ కూడా అలాగే ఉండిపోతుంది. మినిమం ముప్పై సెకన్లు అంటే అరనిమిషం పాటు చేతుల్ని రుద్దు కోవాలి, వేళ్లు, చేతివెనక భాగం ఇలా ప్రతి దాన్ని రుద్ది వాటర్ తో కడగాలి.చేతులు కడుక్కున్నాక ట్యాప్ ఆఫ్ చేయడానికంటే ముందు టాప్ ని శుభ్రం చేయాలి.
చేతులు కడుక్కున్న తర్వాత టవల్ లేదా, న్యాప్ కిన్ తో తుడుచుకోవాలి. ఇలా హ్యాండ్స్ వాష్ చేసుకున్నాక భోజనం చేయడం వలన దాదాపు పద్నాలుగు రకాల అంటువ్యాదుల్ని నివారించవచ్చు అని నిఫుణుల మాట.
బ్యాక్టిరియా ,ఫంగల్ ఇన్ఫెక్షన్స్ , రకరకాల వ్యాధులు రావడానికి ముఖ్య కారణం మన చేతులు శుభ్రంగా ఉండకపోవడమే . అదే విధంగా చేతులు కడుక్కున్నాక చేతుల్ని ఎక్కడపడితే అక్కడ పెట్టేస్తారు. ముఖ్యంగా కిచెన్ కౌంటర్ టాప్ అనేది ఎన్నో బ్యాక్టిరియాలు కొలువుండే చోటు, అదే విధంగా బాత్రూం హ్యాండిల్ , టివి రిమోట్స్ , మొబైల్ ఫోన్స్ వీటిపైన కంటికి కనపించని బ్యాక్టిరియా ఉంటుంది.
కాబట్టి ఎఫ్పుడైనా కిచెన్ కౌంటర్ టాప్ దగ్గర పనవ్వగానే హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. బాత్రూం డోర్ హ్యాండిల్స్ క్లోజ్ ఆర్ ఓపెన్ చేసిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. మొబైల్స్ , రిమోట్స్ వాడిన చేతులతో తినడం లాంటివి చేయకూడదు, హ్యాండ్స్ వాష్ చేస్కోవాలి. పిల్లల చేతికి రిమోట్స్, మొబైల్స్ ఇవ్వకూడదు.
హ్యాండ్ వాష్ చేసుకునే విధానం:
- మొదటగా వాటర్ తో చేతులు తడిచేసుకోవాలి
- చేతిలో హ్యాండ్ వాష్ లేదా సబ్బు తీసుకోవాలి.
- 35-45 సెకండ్లు పాటు చేతుల్ని బాగా రుద్దాలి, వేళ్ల మధ్య, చేతివెనుక భాగం.
- నీటితో చేతుల్ని బాగా కడగాలి.
- కడిగిన చేతుల్ని శుభ్రమైన న్యాప్కిన్ లేదా టవల్ తో తుడుచుకోవాలి.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే అనలేదు పెద్దలు.
End of Article